దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్​ హరీష్​

దీపావళిని జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్​ హరీష్​
దీపావళి పర్వదినాన్ని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ పండగ ప్రజల జీవితాల్లో మంచిని తీసుకురావడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్​ హరీష్​ ఆకాంక్షించారు. గురువారం దీపావళి పండగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్​ హరీష్​ జిల్లా ప్రజలతో పాటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండగ అంటే దుష్టశక్తులపై ధైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా పండగను జరుపుతామని… అలాగే దీపావళి రోజున లక్ష్మీ, సరస్వతీ పూజలు చేసి ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో ఉంటారన్నారు. అలాగే జిల్లాలోని ప్రజలు టపాసులు కాల్చే సందర్భంలో అవసరమైన జాగ్రత్తలు, కోవిడ్​ నిబంధనలు పాటిస్తూ పండగను ప్రతి ఒక్కరు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్​ హరీష్​ కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post