దీపావళి పండుగ లోగా శ్యామకుంట వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

దీపావళి పండుగ లోగా శ్యామకుంట వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-

వచ్చే దీపావళి పండుగలోగా వేములవాడ పట్టణం శ్యామకుంట వెజ్, నాన్-వెజ్ మార్కెట్ ను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

బుధవారం వేములవాడ పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి తో కలిసి పరిశీలించారు.

మొదట భగవంత్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను స్పీడ్ అప్ చేసి సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పట్టణంలో స్కూల్ లలో మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద చేపట్టిన అన్ని పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలనీ ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు.

అనంతరం G + 1 విధానంలో నిర్మాణంలో ఉన్న శ్యామకుంట వెజ్, నాన్-వెజ్ మార్కెట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మార్కెట్ పనులు 80 శాతం మేర పూర్తి అయినందున మిగతా పనులను దీపావళి లోగా పూర్తి చేయాలన్నారు. భూ సరిహద్దు సమస్యలనూ పరిష్కరించాలని స్థానిక తహశీల్దార్ రాజు కు సూచించారు. ప్రస్తుతం ఉన్న ఎలి వేష న్ ప్లాన్ బాగోలేదని… సింపుల్ గా ఉన్న అందంగా ఉండేలా ప్లాన్ చేయాలన్నారు. మార్కెట్ ను అనుకుని ఉన్న గోడలకు మున్సిపల్ పథకాలు లేదా సామాజిక సందేశం ఇచ్చేలా పెయింటింగ్ వేయించాలని అన్నారు.

ఆ వెంటనే జిల్లా కలెక్టర్ వేములవాడ మార్కెట్ కమిటీ లో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ ను పరిశీలించారు. నిర్మాణ పనులతో పాటు ఎలివేషన్ ప్రణాళిక లు కూడ ఇప్పుడే సిద్ధం చేసుకోవాలనీ సూచించారు. టాయిలెట్ ల నిర్మాణం కూడ ప్రారంభించాలని అన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అగ్రహారం సమీపంలో నిర్మాణంలో ఉన్న డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. షేడ్ ల పనులను వేగిరం చేయాలన్నారు. షేడ్ పనులతో పాటు అంతర్గత రోడ్డు పనులను చేపట్టాలని అన్నారు. నెలరోజుల్లో గా డంపింగ్ యార్డ్ ను వినియోగంలోకి తెచ్చేలా పనులకు వేగంగా చేపట్టాలని అన్నారు.

వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ కు జిల్లా కలెక్టర్ అభినందన

స్వచ్ఛ సర్వెక్ష న్ -2022 అవార్డ్ కు వేములవాడ పట్టణం ఎంపిక అవ్వడం పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి ను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మంచి పనితీరుతో మరెన్నో అవార్డులు చేజిక్కించుకోవాలని అన్నారు.

పర్యటన లో జిల్లా కలెక్టర్ వెంట ప్రజారోగ్య విభాగం కార్య నిర్వాహక ఇంజనీరు సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post