మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.
వెలుగులు జిమ్మే దీపావళి సందర్భంగా జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని సుఖసంతోషాలు తో జీవితాలు సాఫీగా సాగాలని గత రెండు దశలలో కరోనా వైరస్ చాలామంది ప్రజలలో భయాన్ని దుఃఖాన్ని మిగిల్చిందని ఈ దీపావళి సందర్భంగా ఇక ఆ మహమ్మారి మళ్లీ రాకూడదని కోరుకుంటున్నామని తెలిపారు.
జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసే దిశలో సిబ్బంది, అధికారులు చాలా శ్రమిస్తున్నారని, ఇంకా వ్యాక్సినేషన్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని తద్వారా కోవిడ్ బారినుండి రక్షించుకోవాలని తమ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని వారు ప్రజలను కోరారు.