వనపర్తి నవంబర్ 3, 2021
పత్రికా ప్రకటన
దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి… జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష.
ప్రజల జీవితాల్లో దీపావళి పండగ కోటికాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష ఆకాంక్షించారు.
చీకటి నుంచి వెలుగులోకి… చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని, ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగను ఆనందోత్సవాలతో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని అన్నారు.
చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటుందని, ఏ కాలంలోనైనా.. ఎప్పటికైనా చెడుకు తావు ఉండదని మంచి చేసే వారికే దైవం కూడా సహకరిస్తుందని ప్రతి ఒక్కరు మంచిని కోరుకోవాలని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండగను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన మేరకు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలిగి ప్రతి ఇంటా కోటి ఆనంద దీపాలు వెలగాలని కలెక్టర్ షేక్ యస్మీన్ భాష ఆకాంక్షించారు.
————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి జిల్లా ద్వారా జారీచేయనైనది.