దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఆలన ద్వారా వైద్య సేవలు – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఆలన ద్వారా వైద్య సేవలు – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లాలో క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు అవసరమైన ప్రత్యేక చికిత్స అందించేందుకు ఆలన వాహనాలు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ తెలిపారు.

సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలస వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటున్న వయోవృద్ధులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఆలన వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వాహనంలో డాక్టర్తో పాటు ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పక్షవాతం, వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తామన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు గుర్తించిన 72 మంది క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి ఆలన ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు.

ఆలన సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి దీర్ఘకాలిక, పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధులను గుర్తించి ఆలన ద్వారా చికిత్స అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో సుధాకర్ లాల్, ఆలన మెడికల్ అధికారి డాక్టర్ శ్రీవాణి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృష్ణమోహన్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ శీను, రేణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post