వరంగల్
@దుగ్గొండి, అడవి రంగాపురం
జిల్లా లో ఇటీవల కురిసిన వడగాండ్ల వాన వల్ల దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామంలో
దెబ్బ తిన్న మొక్కజొన్న, వరి పంటలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు k. చంద్రశేఖర్ రావు గురువారం పరిశీలించారు
హెలికాప్టర్ ద్వారా
ముందుగా అడవి రంగాపురం కి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, సి ఎం osd స్మిత సభర్వాల్
ఎంపీ కవిత, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు
MLC పల్లా రాజేశ్వర్ రెడ్డి,
ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య
MLA లు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మా రెడ్డి, నన్నపునేని నరేందర్, రాజయ్య లతో కలిసి ముందుగా వ్యవసాయ, ఉద్యనవన శాఖ వారు వడగాండ్ల వాన వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న, అరటి, మామిడి, బొప్పాయి, మిరప తదితర పంటల
పైన ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను
ముఖ్యమంత్రి వర్యులు
పరిశీలించారు
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులు అధైర్య పడొద్దని, పంట నష్ట పోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు
అనంతరం అడవి రంగాపురం లో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంట క్షేత్రం లోకి ముఖ్యమంత్రి వర్యులు వెళ్లి స్వయం గా
పరిశీలించి అక్కడే ఉన్న రైతులతో
కాసేపు మాట్లాడి…. అధైర్య పడొద్దని… ఈ సమయంలో నే ధైర్యం గా ఉండాలన్నారు
నష్ట పరిహారం ఇచ్చి రైతులను తప్పకుండ ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి k. చంద్రశేఖర్ రావు తెలిపారు