దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు మన బడి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్…
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, ఎంఈవో, ఎంపిడిఒ, ఎంపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఈఈ, డిఈ, ఎఈ నిర్మాణ ఏజెన్సీలు, సర్పంచ్ లు అందరితో కలిసి మండలాలోని పాఠశాలల వారిగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ….. పాఠశాల లో మన ఊరు మన బడిలో మల్టిపుల్ పనులను కాంట్రాక్టర్ ఏకకాలంలో సపరేట్ టీం లను పెట్టి పనులు త్వరగా పూర్తి చేసి రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా జనవరి మొదటి వారంలో ప్రారంభించడానికి సిద్దం చెయ్యాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద టేండర్ పనులు చేయ్యాడానికి ఆలస్యం అవుతుంది కాని చిన్న చిన్న పనులకు ఎక్కువ సమయం తీసుకోకుడదు. మన ఊరు మన బడి పథకం లో ఎలక్ట్రిసిటీ పనుల్లో నాణ్యమైనవి (రూపింగ్ లైట్లు ప్యాన్లు), తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లు,తో పాటు ఈజీఎస్ పనులు టాయిలెట్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, డైనింగ్ హల్, అదనపు తరగతి గదులు ఇతర పనులు ఉన్నాయి. దుబ్బాక మండలం లో ఇసుక కొరత ఉందని అడగ్గా తహసీల్దార్ వచ్చి పరిష్కరిస్తారన్నారు. భవనం అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదు పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే మైదానంలో సుందరీకరణ చేయ్యాలి మంచి గేట్, పైన ఆర్చ్ మైదానంలో కొంత గడ్డి కార్పెట్ పరచాలని సూచించారు. ఎంపిడిఒ, ఎంపిఓ లు ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ చేయ్యాలి. ఎచ్ఎమ్ లు తప్పనిసరి గా పాఠశాల పథక పూర్వం తర్వాత పోటో ఆల్బమ్ పెట్టుకోవాలి పాఠశాల పేరు ను స్టిల్ కలర్ మాదిరి పెట్టాలి. ఎఈలు ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలి మరియు కలరింగ్ ఏజెన్సీ కి మెథర్ మెంట్ షిట్ అందించాలి. ఎంపిడిఒ ఎంపిఓ లు ఏఈ లకు తోడ్పాటునందించాలి. పనులు పూర్తి అయ్యేవరకు ప్రతి సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం కావున మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశం లో డీఆర్డీఏ పిడి గోపాల్ రావు, డిఇఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
issued by district public relations officer siddipet