దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రతీ చేరువులో నీటిని నింపేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,సత్యవతి రాథోడ్ లు .

ఆదివారం నాడు హనుమకొండ కలెక్టర్ సమావేశ మందిరంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ పరిధిలోని చిన్న నీటి పారుదల మరియు జే.ఆర్. సి దేవాదుల ప్రాజెక్టు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి శ్రీమతి కవిత, సీఎంవో కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్, ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం మంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు గత ప్రభుత్వాలు పూర్తి స్ధాయి లో నిర్లక్ష్యం వహించారని…కానీ తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో అరవై టీయంసీల నీటిని లిఫ్ట్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. గతంలో దేవాదుల ప్రాజెక్టు ఐదు లేదా ఆరు టీయంసీల లిఫ్ట్ కు మాత్రమే పరిమితం ఉండేదని, మూడు ,నాలుగు నెలల మాత్రమే నీళ్ళు పారేదనీ, ఇప్పుడు తొమ్మిది నెలలు నీళ్లు పారేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు లక్షల ఇరవై వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుందనీ అన్నారు. జనగామ జిల్లా లో ప్రతి చెరువు ను నీటితో నింపామని అన్నారు. శాసనసభ సభ్యులు తమ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఉమ్మడి జిల్లా లో ప్రతి చెరువు నింపాలని అన్నారు. దేవాదుల మొదటి దశ పాకేజీ45 కింద 96 శాతం పాకేజీ 46 లో 91 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. నక్కలతూమ్ కింద ఉన్న పదిహేడు వందల ఎకరాల ఆయుకట్టుకీ నీటి సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. ఆర్ యస్ ఘన్ పూర్ పనులు 97శాతం పూర్తి అయ్యాయన్నారు. జనగామ జిల్లా కు సంబంధించిన నీటి ప్రాజెక్టు లకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అన్నారు. పెండింగ్ పనులనూ పూర్తి చేయాలని ఆయన కోరారు. వేలేరు మండలం ఎతైన ప్రదేశంలో ఉందని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. పాలకుర్తి, ఘన్ పూర్ లో ఆగిన ఆరవ పాకేజీ పనులు కూడా ఖచ్చితంగా ప్రారంభించాలని అన్నారు. లింగం పల్లి రిజార్వాయర్ పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.ములుగు జిల్లా, భూపలపల్లి జిల్లా లో, చెక్ డామ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లను నిర్మించాలని అన్నారు.

రాష్ట్ర గిరిజన, మహీళ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ మాట్లాడుతూముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందులోభాగంగా చివర ఆయకట్టు వరకు నీళ్ళు అందించుటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొని ఉన్న ప్రాజెక్టును రెవిన్యూ, ఇర్రిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేసి పూర్తి చేయాలని ఆమె అన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, వరంగల్, జనగామ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, సంపత్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్క, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మరెడ్డి, హనుమకొండ కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ,ములుగు జిల్లా, భూపలపల్లి ఇంచార్జి కలక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, వరంగల్ కలక్టర్ ఎం. హరిత,నీటి పారుదల శాఖ ఈ ఎన్సీ జనరల్ మురళీధర్ రావు, వరంగల్ సీఈ వీరయ్య, ములుగుసీఈ విజయ భాస్కర్, హనుమకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ వాసుచంద్ర, ములుగు ఆర్డీవో రమాదేవి, ఇరిగేషన్ ఎస్ ఈలు సుధాకర్ రెడ్డి,యశ్విని,వెంకటేశ్వర్లు, సుధాకర్, ఈఈలు ఆంజనేయులు, సీతారాం, మంగిలాల్, ప్రవీణ్, రమేష్ బాబు, శశిభూషన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post