దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వంద శాతం వ్యాక్సినెషన్ చేసిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో నిలవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వంద శాతం వ్యాక్సినెషన్ చేసిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో నిలవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం మంత్రి హైదరాబాద్ నుండి రాష్ట్రంలో కో విడ్ వ్యాక్సినేషన్ పురోగతి , కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పురోగతి, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, మెరుగైన వైద్య సేవలు అందించడం తదితర విషయాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలుఅందించాలని,ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు వైద్యులు,వైద్య సిబ్బంది మంచి వైద్యం అందిచేలా చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన అన్ని ఎక్యుప్మెంట్స్ ఉన్నాయన్నారు. ప్రతి ఎక్యుప్మెంట్ పనిచేస్తుండాలన్నారు.

ప్రతి సి హెచ్ సి,, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లూ అన్ని అందుబాటులోకి తీసుకు రావాలన్నారు.

హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ నకు జిల్లా కలెక్టర్ విధిగా హాజరు కావాలన్నారు. ప్రతి విభాగం ,డాక్టర్ వారీగా, హెడ్ నర్స్ , హెల్త్ వర్కర్ వారిగా రివ్యూ లు నిర్వహించాలని సూచించారు.

డాక్టర్లు, వైద్య సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు. సి హెచ్ సి, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రిలో డాక్టర్లు అందరూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు 4 గంటల నుండి 6 గంటల వరకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఆరోగ్యశ్రీ కి సంబంధించిన సేవలను, ఆయుష్ ,యునాని ఆయుర్వేదిక్, హోమియోపతి ఆస్పత్రులు ఆయా డాక్టర్ల పనితీరుపై, లెప్రసీ, మలేరియా బ్లైండ్ నేస్, టీబీ విభాగాల సేవల పనితీరుపై సమీక్షించాలని కలెక్టర్లకు సూచించారు.

ఆస్పత్రులలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని , ఆసుపత్రులకు వచ్చే రోగులను ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించాలని సూచించారు. ప్రజలు, రోగుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సేవలందించాలని సూచించారు

ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, డి సి హెచ్ ఎస్ , డిఎంఅండ్హెచ్ఓ, జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించేలా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి భరోసా కల్పించాలన్నారు.

8 జిల్లాల్లో మంజూరైన వైద్య కళాశాలల పురోగతిని ఆయా కలెక్టర్లతో మంత్రి ఆరా తీశారు.
వైద్య కళాశాలల నిర్మాణం వేగవంతం చేయాలని, విద్యార్థులకు హాస్టల్స్ ను గుర్తించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ
జిల్లాలో ఇప్పటివరకు 12,26,628 మంది అర్హులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు. అందులో మొదటి డోసు 8,90,349 మందికి, రెండవ డోసు 3,36,279 మందికి వేశామని తెలిపారు.

జిల్లాలోని 506 హ్యాబి టేషన్లు, మున్సిపాలిటీలలో ని 80 వార్డులు, బొల్లారం, తెల్లాపూర్ మున్సిపాలిటీలు,
కంది, కొండాపూర్, మునిపల్లి మండలాలు, ఆత్మకూర్ ,బొల్లారం, చింతలచెరు, హత్నూర, కంది ,కొండాపూర్ ,మునిపల్లి, న్యాల్కల్ పి హెచ్ సి లు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు.
జి హెచ్ ఎం సి పరిధిలో ఇప్పటివరకు 1,65,745 మందికి టీకా వేశామని ఆయన తెలిపారు.

సంగారెడ్డి మెడికల్ కళాశాలకు సంబంధించి కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని, నెలలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. బాలురకు, బాలికలకు విడివిడిగా హాస్టల్స్ గుర్తించి, సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.

జిల్లా మెడికల్ కాలేజీకి సంబంధించి
ఇప్పటివరకు 40 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 28 మంది సీనియర్ రెసిడెంట్స్ వచ్చారని తెలిపారు.

డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం మరో భవనంలోకి 60 శాతం మేర షిఫ్ట్ అయిందని , వారంలోగా పూర్తిగా షిఫ్ట్ అవుతుందని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి అదనపు కలెక్టర్ రాజర్షి షా, డిఎంఅండ్హెచ్ఓ డా.గాయత్రి దేవి ,డి సి హెచ్ ఎస్ డా. సంగారెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శశాంక్, డా. రాజేశ్వరి, డి పి ఓ సురేష్ మోహన్, ఆర్ అండ్ బి. ఈఈ సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post