దేశంలో ఆకలి చావులు ఉండొద్దనేదే ఆహార భద్రతా చట్టం-2013 ఉద్దేశమని ఆహార భద్రతా కమీషన్ చైర్మన్ తిరుమల రెడ్డి

దేశంలో ఆకలి చావులు ఉండొద్దనేదే ఆహార భద్రతా చట్టం-2013 ఉద్దేశమని ఆహార భద్రతా కమీషన్ చైర్మన్ తిరుమల రెడ్డి

దేశంలో ఆకలి చావులు ఉండొద్దనేదే ఆహార భద్రతా చట్టం-2013 ఉద్దేశమని ఆహార భద్రతా కమీషన్ చైర్మన్ తిరుమల రెడ్డి అన్నారు. జిల్లాలో ఆహార భద్రతా చట్టం అమలు తీరుతెన్నులను క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి మంగళవారం మెదక్ జిల్లాకు వచ్చిన చైర్మన్ నరసాపూర్ లోని 30, 31 వ రేషన్ దుకాణాలను, జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలను , తుల్జారాంపేట తండాలో అంగన్వాడీ కేంద్రాన్ని, కౌడిపల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు సరుకులు సక్రమంగా అందుతున్నాయా, పాఠశాలలో మధ్యాన్నం భోజనం మెనూ ప్రకారం పిల్లలకు ఇస్తున్నారా, అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు, తల్లులకు, శిశువులకు పౌష్టికాహారం అందజేస్తున్నారా, ప్రాథమికా ఆరోగ్య కేంద్రాలలో ప్రసూతి జరిగిన వారికి కె.సి.ఆర్. కిట్లు అందజేస్తున్నారా, 12 వేల రూపాయలు అందజేస్తున్నారా అని అధికారులను, లబ్ధిదారులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి కష్టాలలో ఉన్న వారికి ఆహార భద్రతా కల్పించి ఆరోగ్యవంతమైన మానవ సంపద పెంపొందించుటకు గాను ఆహార భద్రతకు చట్ట రూపం కలిగించి , చట్ట పరమైన హక్కులను కల్పించిందని అన్నారు. లబ్దిదారులకు సరఫరాలో లోపం ఉంటె పరిహారం పొందడానికి హాక్కు ఉంటుందని, మండల, జిల్లా స్థాయిలో ఉన్న విజిలెన్సు కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిహారం పొందడానికి హాక్కుంటుందని ఈ విషయంపై పై ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయుటకు ఇంకా చేపట్టవలసిన కార్యక్రమాలపై గురువారం నాడు జిల్లా కేంద్రంలో సంబంధిత శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతువుందని అన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు అవసరం లేనివారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సరెండర్ చేసి ఆకలితో అలమటిస్తున్న బీద వారికీ, వారికి , ఆర్థికంగా వెనుకబడిన వారికీ ఇతోధికంగా సహాయ పడాలని కోరారు. అర్హులైన ప్రతి పేద వానికి రేషన్ కార్డు అందేలా చూడాలని, ఒకవేళ తిరస్కరిస్తే అందుకు గల కారణాలు తెలపాలని సూచించారు. ప్రతి రేషన్ షాపు ఎదుట కార్డుదారులు వివరాలు , యూనిట్ల జాబితాను ప్రదర్శించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని, సోషల్ ఆడిట్ సరిగ్గా నిర్వహించాలన్నారు. రేషన్ దుకాణాలకు వచ్చిన లబ్ధిదారులతో ముచ్చటిస్తూ బియ్యం బాగా లేకపోతె ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో మధ్యాన్నం భోజనం అమలు తీరును పరిశీలించి, అక్షయ పాత్ర ద్వారా భోజనం అందిస్తున్నందున స్టాక్ లో ఉన్న బియ్యం త్రిప్పి పంపాలని సూచించారు. తుల్జారాం పెట్ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించాలని, వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. కౌడిపల్లి పి .హెచ్.సి.లో ఇంతవరకు 927 ప్రసవాలు జరగగా అందరికి కె.సి.ఆర్. కిట్లు అందజేశారా అని వైద్యులను అడిగారు. ఒక వేల అందకపోతే లోపం ఎక్కడుందో తెలుసుకొని లబ్దిదారులకు సహకరించాలని సూచించారు. డి.ఆర్.డి.ఓ. డి.ఈ.ఓ. డి. డబ్ల్యూ.ఓ డి .ఏం.అండ్ హెచ్.ఓ. తదితర సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేసుకొని . ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు జరుపుటకు తగు చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ కమిటీ సమావేశమై చర్చించుకోకు అవగాహన కార్యాక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ పర్యటనలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, జిల్లా సంక్షేమాధికారి జయరాం నాయక్, అదనపు డి.ఏం.అండ్ హెచ్.ఓ. విజయన నిర్మల, ఆర్.డి.ఓ. సాయి రామ్, సి.డి.పి .ఓ. హేమలతా భార్గవి, పి హెచ్.సి. వెంకటస్వామి, తహసీల్ధార్లు, మండల పరిషద్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post