దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో స్వతంత్ర భారతవజ్రోత్సవాలు – జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి

దేశంలో ఎక్కడా లేనివిధంగా
తెలంగాణలో స్వతంత్ర భారతవజ్రోత్సవాలు
– జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి
——————————-

దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసిఆర్ నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు.

వేడుకల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛoదంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.

పట్టణంలోని మానేరు నది ఒడ్డున బతుకమ్మ ఘాట్ లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి ,
ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ లు ప్రారంభించారు.

ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు కొనసాగింది.

75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం తొమ్మిది గంటల సమయానికే వందలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారు.

గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ యువకులు మొదలు వృద్ధుల వరకు కదంకదం కలుపుతూ ర్యాలీ లో పాల్గొనడం జాతీయ సమైక్యతకు అద్దం పట్టింది. బెలూన్ లను ప్రజా ప్రతినిధులు, అధికారులు విడుదల చేశారు.

జిల్లా యంత్రాంగం వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించి సమకూర్చిన శ్వేతవర్ణపు టీ షర్టులను ధరించి వేలాది మంది ర్యాలీలో పాల్గొనడం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ సమానత్వపు చిహ్నానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ…
ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిoదన్నారు.
భావితరాలకు స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తెలియజేయడం… వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరినీ ప్రేరేపించడం వేడుకల ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.
——————————-
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
——————————-
స్వతంత్ర సమరయోధుల త్యాగాఫలమే
దేశానికి స్వాతంత్య్రం

– *వారి త్యాగాలను స్మరించుకునేందుకు
వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నాం.*

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

స్వతంత్ర సమరయోధుల త్యాగాఫలమే
దేశానికి స్వాతంత్య్రం అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
వారి త్యాగాలను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు
వజ్రోత్సవాలను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి రోజూ 2 వేల మందికి గాంధి సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నామని తెలిపారు. వజ్రోత్సవ వేడుకల పురస్కరించుకుని 15 రోజుల పాటు
ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

——————————-
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…
——————————-
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో,మండల కేంద్రలల్లో, గ్రామలల్లో సామూహికంగా జాతీయ గీతాలాపన నిర్వహించడం జరుగుతుంది.16 వ తేదీ మంగళవారం రోజున ఉదయం 11:30 కి నిర్వహించబోయే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్పీ గారు అన్నారు..జాతీయ గీతాలాపన చేసే సమయంలో వాహనాల రాకపోకలు లేకుండా అన్ని జంక్షన్ లలో ట్రాఫిక్ ని నిలిపివేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, deo రాధా కిషన్, dwo లక్ష్మి రాజం, జిల్లా యువజన క్రీడా అధికారి ఉపేందర్, dpro మామిండ్ల దశరథం , టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్, విద్యార్థులు, ఎన్ సి సి, స్కౌట్స్, గైడ్స్ ,మహిళలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

__________

 

Share This Post