దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు : రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ దేశం దృష్టిని తెలంగాణ రాష్ట్రం ఆకర్షిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇందక్రరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ నేత, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీతో కలిసి మందమర్రి పరిధిలో రైల్వే ఓవర్‌బ్రిడ్డి నిర్మాణంతో పాటు సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కార్యక్రమం అమలతో అందరి దృష్టిని ఆకర్షించామని, ఆయిల్‌ఫామ్‌ అంశంతో వినూత్న పంట సాగు విధానంతో రైతులను ప్రోత్సహించడం జరిగిందని తెలిపారు. మందమర్రిలో అర్బన్‌ పార్క్‌ ఏర్పాటు కొరకు 600 ఎకరాలలో 5 కోట్ల రూపాయల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం ఒకే చోట లభించే విధంగా అన్ని హంగులతో 7 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో మూడు ఎకరాల విస్తీర్ణంలో సమీకృత మార్కెట్‌ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు మాట్లాడుతూ చెన్నూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని, ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి, పల్లి ప్రగతి కార్యక్రమాలలో భాగంగా పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని, 48 కోట్ల రూపాయల నిధులతో మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఫంక్షన్‌వాల్‌ సిద్దం చేయడం జరుగుతుందని, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాట్లతో పాటు రహదారులు, అంతర్గత రహదారులు, మురుగుకాలువల నిర్మాణ పనుల నిర్వహణ కొరకు ప్రణాళిక సిద్దం చేయడం జరుగుతుందని తెలిపారు. పేదవారికి గూడు కల్పించే దిశగా 560 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, 600 ఎకరాలలో పార్మ్‌ మొక్కల పెంపకంతో అడవిని అభివృద్ధి చేయడంతో పాటు బతుకమ్మ గ్రౌండ్లు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కొరకు 80 వేల కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు, ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం జరిగిందని, రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమాతో పాటు పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్షీ, షాదిముబారక్‌ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post