దేశం లోనే ఎక్కడా లేని విధం గా రాష్ట్రంలో సంవత్సరం క్రితం ప్రారంభించిన భూ పరిపాలన రంగం లో విప్లవాత్మక మైన ధరణి కార్యక్రమం జిల్లాలో సమర్థవంతం గా అమలు అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.

 దేశం లోనే ఎక్కడా లేని విధం గా రాష్ట్రంలో సంవత్సరం క్రితం ప్రారంభించిన భూ పరిపాలన రంగం లో విప్లవాత్మక మైన  ధరణి  కార్యక్రమం జిల్లాలో సమర్థవంతం గా అమలు అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.  భూ సమస్యల పరిష్కారం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ నల్గొండ జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని ఆయన తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్బంగా శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ధరణి అనేది రెవెన్యూ పరిపాలన లో సురక్షిత మైన ,అవాంతరాలు లేని,ట్యాo పర్ ప్రూఫ్ గా ఉందని,వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన అత్యాధునిక ఆన్ లైన్ పోర్టల్,భూ సంబంధిత లావా దేవీ లకు ధరణి వన్ స్టాఫ్ పరిష్కారంను అందిస్తుందని ఆయన అన్నారు.ముఖ్య మంత్రి మంచి విజన్ తో, పారదర్శక మైన రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను  తయారు చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ధరణి సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. గతంలో జిల్లాలో కేవలం కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండగా ధరణి వచ్చాక జిల్లా లోని అన్ని తహశీల్డార్ ఆఫీసు లలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతోందన్నారు. స్లాట్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ  సమయంలోనే   రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవడంతో పాటు, మ్యుటేషన్ ప్రాసెస్ కూడా వెంటనే పూర్తి అవుతుందన్నారు. జిల్లాలో గడచిన ఏడాది కాలంలో 28700 సేల్స్ లావా దేవీలు, 15373 గిఫ్ట్ డీడ్ లు, 4052 సక్సేషన్ లు,2501 తనఖా లావాదేవీలు జరిగాయని వివరించారు. అలాగే 11873 పెండింగ్ మ్యుటేషన్ లు క్లియర్ చేశామని, 10361 ప్రత్యేక భూ సంబంధిత విషయాలు, 6488 ప్రోహిబిషన్ లిస్ట్ సమస్యలు, 1733 కోర్ట్ కేసులు పరిష్కరించామనీ తెలిపారు. ధరణి లో 31 రకాల మాడ్యుల్ లు అందుబాటులో ఉన్నాయని  ప్రజలు వీటిని వినియోగించు కొని భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించు కావాలని సూచించారు.
        ఈ సమావేశం డి.పి.ఆర్.ఓ.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ధరణి హైలెట్స్
       నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత.  ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్ ఉన్నాయి.
   *రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు*
 హిట్‌ల సంఖ్య : 5.18 కోట్లు
 బుక్ చేసిన స్లాట్‌లు : 10.46 లక్షలు
 పూర్తయిన లావాదేవీలు : 10,00,973
 విక్రయాలు  : 5,02,281
 గిఫ్ట్ డీడ్  : 1,58,215
 వారసత్వం : 72,085
 తనఖా : 58,285
 పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
 పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
 భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
 నిషేధించబడిన జాబితా : 51,794
 కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618
*నల్గొండ జిల్లాలో జరిగిన ధరణి లావాదేవీలు*                 పూర్తయిన లావాదేవీలు:50626
విక్రయాలు  : 28,700
 గిఫ్ట్ డీడ్  :   15373
 వారసత్వం : 4052
 తనఖా :      2501
 *జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు*         జిల్లాలో పరిష్కరించిన ఫిర్యాదులు 30455
 పెండింగ్ మ్యుటేషన్లు. : 11873
 భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 10361
 నిషేధించబడిన జాబితా : 6488
 కోర్ట్ కేసులు మరియు సమాచారం : 1733
*ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు

Share This Post