దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగాలి – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగాలి – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 

రైతును, వ్యవసాయ వృత్తిని మనందరం గౌరవించాలి

 

వ్యవసాయానికి మూడు లక్షల 75 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం

 

ప్రస్తుత తరానికి వారు తినే ఆహారం ఎలా వస్తుందో కూడా తెలియడం లేదు లేదని వారందరికీ రైతుల పట్ల గౌరవం పెంచేలా మనమందరము పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

సోమవారం నాగర్ కర్నూలు జిల్లా పొంగూరు మండలంలోని వంగూర్ గ్రామ శివారులో నాబార్డు ద్వారా 33 కోట్లతో నిర్మించిన వ్యవసాయ గోదాంను వంగూరు, తిప్పారెడ్డి పల్లి రైతు వేదికలను అచ్చంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఎంపీ రాములు జిల్లా పరిషత్ చైర్మన్ పద్మావతి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ లతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.

కోనేటి పూర్ గ్రామంలోని వి హెచ్ ఆర్ ఫంక్షన్ హాల్ లో వ్యవసాయ అధికారులకు రైతులకు రైతు సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

దేశంలో ఒకే విధమైన వ్యవసాయ విధానం ఉండాలని అన్నారు.

సాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించికునేందుకు రైతులు వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని,

ఒకసారి చైతన్యం చేస్తే తెలంగాణ రైతులు దేశానికి దిక్సూచీలవుతారన్నారు.

వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేస్తానని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ పంటల పెట్టుబడి రెట్టింపు చేశాడని విమర్శించారు.

దేశానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం రావాలన్నారు.

రైతును, వ్యవసాయ వృత్తిని మనందరం గౌరవించాలని, కనిపెంచిన తల్లితండ్రుల తర్వాత కర్షకులనే గౌరవించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

ప్రస్తుత తరానికి వారు తినే ఆహారం ఎలా వస్తుందో కూడా తెలియడం లేదు. వారికి శ్రమ విలువ, ఆహారం విలువ తెలిసేలా చూడాలని సూచించారు. దశాబ్దాలపాటు అవమానాలకు గురైన రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో తలెత్తుకు జీవిస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయ రంగం కోసం ఖర్చు చేశామని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా ఖర్చు పెట్టలేదని అన్నారు. రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీళ్లతో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయిందని తెలిపారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు వ్యవసాయ శాఖ సూచనలను రైతులు పాటించాలి. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో పాటు, పంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా రైతులు పంట కాలాలను ముందుకు జరుపుకోవాలి.

అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడేవిధంగా పంటల ఉత్పాదకతను పెంచుకోవాలి. రైతువేదికలలో నిరంతరం రైతులను ఈ దిశగా శిక్షణలు ఇచ్చి వ్యవసాయ శాఖ చైతన్యం చేయాలి. సాంప్రదాయ సాగు నుండి రైతాంగం బయటకు రావాలి. విత్తనాల ఎంపిక, విత్తనశుద్ది, భూసార పరీక్షలు, పచ్చిరొట్ట ఎరువుల వాడకం, రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం, పంటల సాగు, దిగుబడులు పెంచే విధానాలపై రైతులను అధికారులు చైతన్యం చేయాలి. ఒకసారి రైతులను చైతన్యం చేస్తే తెలంగాణ రైతులు దేశానికి దిక్సూచీలవుతారు.

ఏటా ప్రపంచంలో 4 కోట్ల 50 లక్షల పత్తి బేళ్లు అవసరం. మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ లలో పత్తి ఎక్కువగా పండుతుంది. ప్రపంచంలోనే పరిమిత దేశాలలోనే పత్తి సాగుకు అవకాశం ఉన్నది. అన్ని దేశాలలో కలిపి 3 కోట్ల 25 లక్షల బేళ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. దేశంలో ఉత్పత్తి అవుతున్న పత్తిలో తెలంగాణ పత్తి న్యాయమైనది.

పత్తితో పాటు కంది సాగును పెంచాలి. నూనెగింజలు, పప్పు గింజలకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నది. ఆవాలు, నూగులు, వేరుశెనగ, పొద్దు తిరుగుడు, ఆముదం, మినుములు, పెసలు, పప్పుశెనగ తదితర పంటలు సాగుచేయాలి. ఆముదం పంటకు పెద్దఎత్తున డిమాండ్ ఉన్నది. యాసంగిలో ఆముదం సాగు ఎంతో లాభదాయకం. ఈ విషయాలు నేరుగా రైతులకు తెలియాలన్నదే వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రతి రైతు ఇంటి గడప తట్టేది వ్యవసాయ శాఖ ఒక్కటే. వ్యవసాయ అధికారులు రైతుల కుటుంబాలలోనే భోజనం చేసి వారితో అనుబంధం పెంచుకోవాలి. వైవిధ్యమయిన, భిన్నమైన, సమీకృత వ్యవసాయం వైపు రైతులు మళ్లాలి. ఒకే రకమైన పంటల సాగు ద్వారా భూమి తన సహజత్వాన్ని, సారాన్ని కోల్పోతుందన్నారు. పంటలమార్పిడి ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవాలన్నారు.

కోతులబెడద పేరుతో రైతులు పంటల సాగుపై వెనకడుగువేయొద్దు. హైదరాబాద్ కాటెదాన్ లో ఏర్పడిన తొలి పరిశ్రమలు ఆముదం, వేరుశెనగ నూనెలవే. అచ్చంపేట పరిధిలో మిగిలిపోయిన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కృషిచేస్తాం. వ్యవసాయానికి ఉపాధిహామీని అనుసంధానం చేయాలి. పార్లమెంట్ లో తొలిసారి ఈ విషయాన్ని డిమాండ్ చేసింది టీఆర్ఎస్. ఈ విషయంలో హామీ ఇచ్చిన మోడీ అది నేరవేర్చకుండా రైతులను మోసం చేశాడు. పంటలకు మద్దతుధర విషయంలో స్వామినాధన్ కమిటీ సిఫార్సుల అమలుచేస్తామని చెప్పి మోడీ మాటతప్పాడు. దానికి చట్టబద్దత కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నాడన్నారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ పంటల పెట్టుబడి రెట్టింపు చేశాడు. దేశానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉన్నది. పంటలకు మద్దతుధర, కొనుగోళ్లు,ఎగుమతుల విషయంలో కేంద్రానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ వైపు రైతులకు శిక్షణ ఉండాలి. పంట పండించడం రైతుబాధ్యత. కొనుగోళ్లు కేంద్రప్రభుత్వ బాధ్యత అన్నారు.

మూడు క్లస్టర్ల వ్యవసాయ అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇంతకుముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం వ్యవసాయానికి ఇవ్వని ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుందన్నారు.

రైతులకు వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ఎంపీ రాములు మాట్లాడుతూ దేశంలో ఏ వ్యవసాయ శాఖ మంత్రి కూడా వ్యవసాయంపై అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరూ లేరని తెలంగాణలో మాత్రమే వ్యవసాయదారుడే వ్యవసాయ మంత్రిగా ఉన్నందుకు రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.

వ్యవసాయం, న్యాయ వృత్తి, రాజకీయాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి కి డాక్టరేట్ ఇవ్వాలని డాక్టర్ నిరంజన్ రెడ్డి గా నామకరణం చేయాలని అభివర్ణించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ…

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎంతో లాభసాటిగా కొనసాగుతోందన్నారు.

ఈ సమావేశంలో రైతు సమితి జిల్లా అధ్యక్షులు పోకల మనోహర్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమేష్, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు నారాయణరావు, ఎంపీపీ భీమమ్మ, జెడ్పిటిసిలు కె వి ఎన్ రెడ్డి, భరత్ ప్రసాద్, రాంబాబు, ప్రతాపరెడ్డిలు రైతులు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post