దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం—-1

తేదీ.10.5.2022

దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

దేశంలో టాప్10 గ్రామాలుగా నిలిచిన తెలంగాణ పల్లెలు

రైతు సంక్షేమం దిశగా పకడ్బందీ చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం

దేశ రైతాంగానికి అసలైన రైతు భరోసా సీఎం కేసీఆర్

ధరణి వెబ్ పోర్టల్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

దళారి వ్యవస్థ ప్రోత్సాహకం కోసమే ధరణి వెబ్ పోర్టల్ ప్రగల్భాలు

అసత్యాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల పై మంత్రి ఫైర్

జాతీయ అవార్డు సాధించిన కొడిమ్యాల మండలం ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

జగిత్యాల మే 10:- దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లాలోని జాతీయ అవార్డు సాధించిన కొడిమ్యాల మండలం ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు.

ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా
కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం ప్రజా పరిషత్ కు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు అందించిందని మంత్రి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవార్డుల అందించడానికి 10 గ్రామాలను ఎంపిక చేస్తే, 10 గ్రామాలు తెలంగాణలో ఉండటం సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రతీకని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 11 గ్రామాలకు, 4 మండల ప్రజా పరిషత్ లకు,1 జిల్లా ప్రజా పరిషత్ అవార్డులు లభించాయి అని మంత్రి తెలిపారు.

గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం, నూతన పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ సర్పంచులు ప్రజాప్రతినిధులు అధికారులు చేసిన కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తున్నాం అని మంత్రి అన్నారు. కొడిమ్యాల మండలం ప్రజా పరిషత్ స్ఫూర్తితో జిల్లాలోని ప్రతి గ్రామం మండలంలో అభివృద్ధి పనులు పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సూచించారు.

తెలంగాణ గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి నెలా తప్పనిసరిగా 330 కోట్ల నిధులను విడుదల చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ బిజెపి పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.

దేశంలో 18 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకం సైతం ఆ రాష్ట్రాలలో అమలు కావడం లేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సైతం 600 వృద్ధాప్య పెన్షన్ అందిస్తారని, మన రాష్ట్రంలో 2016 ఆసరా పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

గతంలో కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు ఎరువులు సైతం లభించలేదని, వారు రైతు భరోసా సభలు పెట్టడం హాస్యాస్పదమని మంత్రి అన్నారు.

దేశంలో రైతాంగానికి నిజమైన రైతు భరోసా సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోలు,24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా, ఉద్యానవన పంటలు ప్రోత్సాహకం ,వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలను అమలు చేస్తున్నారని, దేశంలో మరే రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ల చర్యలు తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 గంటలు సైతం విద్యుత్ సరఫరా కాక పంటలు ఎండిపోయాయని, ప్రస్తుతం నాణ్యమైన విద్యుత్ 24 గంటలు సరఫరా చేయడం వల్ల రైతులకు చాలా ఉపశమనం కలిగిందని మంత్రి తెలిపారు. 23 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

రైతుల భూ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ధరణి వెబ్ పుటలను సీఎం కేసీఆర్ రూపొందించారని, వాటి వల్ల పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుందని మంత్రి తెలిపారు.

రైతులకు ఉపయోగకరంగా ఉన్న ధరణి వెబ్ సైట్ ను రద్దు చేస్తామని ప్రకటించడం దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమేనని, దళారీల తో కొమ్ముకాసిన కాంగ్రెస్ నాయకుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం లేదని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు మండల ప్రజా పరిషత్ అవార్డులు సాధించాయి, అందులో కొడిమ్యాల మండలం ఒకటి కావడం గర్వకారణమని ఆయన అన్నారు.

అవార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలను ఆయన అభినందించారు, భవిష్యత్తులో సైతం ఇదే స్ఫూర్తితో పని చేసి మరి ఎన్నో అవార్డులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయడం వల్ల అనేక అవార్డులు సాధిస్తామని అన్నారు.

చొప్పదండి పోలీస్ స్టేషన్ కు 2 సార్లు జాతీయ అవార్డులు, పురపాలక సంఘానికి 3 సార్లు జాతీయ అవార్డులు, ప్రస్తుతం కొడిమ్యాల మండల ప్రజా పరిషత్ జాతీయ అవార్డు లభించడం గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు.

పల్లె ప్రగతి కింద సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితంగా గ్రామాల్లో స్వరూపం మారిపోయిందని, ప్రతి గ్రామంలో పచ్చని చెట్లు నాటి సంరక్షిస్తున్న మని అన్నారు. గ్రామాలలో నర్సరీ ,స్మశానవాటిక డంపింగ్ యార్డ్, ట్రాక్టర్, యాంకర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు లో రికార్డు సమయంలో పూర్తి చేయడం వల్ల వరద కాలువ జీవనదిగా మారిందని, చొప్పదండి ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కొడిమ్యాల మండలంలోని దామయ్యపేట గ్రామం లో 1 కరోణ కేసులు సైతం నమోదు కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అనంతరం కొడిమ్యాల మండల ప్రజా పరిషత్ ఎంపీపీ శ్రీమతి స్వర్ణలత రాజ నరసింగ రావులను , వివిధ గ్రామాల సర్పంచులను, అధికారులు, సిబ్బందిని తదితరులు ను ఘనంగా సన్మానించారు.

శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, జెడ్పిటిసిలు, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్లు ,ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయడమైనది

ప్రచురణార్థం----1  తేదీ.10.5.2022  దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  దేశంలో టాప్10 గ్రామాలుగా నిలిచిన తెలంగాణ పల్లెలు  రైతు సంక్షేమం దిశగా పకడ్బందీ చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం  దేశ రైతాంగానికి అసలైన రైతు భరోసా సీఎం కేసీఆర్  ధరణి వెబ్ పోర్టల్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం  దళారి వ్యవస్థ ప్రోత్సాహకం కోసమే ధరణి వెబ్ పోర్టల్ ప్రగల్భాలు  అసత్యాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకుల పై మంత్రి ఫైర్  జాతీయ అవార్డు సాధించిన కొడిమ్యాల మండలం ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  జగిత్యాల మే 10:- దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లాలోని జాతీయ అవార్డు సాధించిన కొడిమ్యాల మండలం ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు.   ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం  జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం ప్రజా పరిషత్ కు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్  అవార్డు అందించిందని మంత్రి తెలిపారు.    కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవార్డుల అందించడానికి 10 గ్రామాలను ఎంపిక చేస్తే, 10 గ్రామాలు తెలంగాణలో ఉండటం సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రతీకని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 11 గ్రామాలకు, 4 మండల ప్రజా పరిషత్ లకు,1 జిల్లా ప్రజా పరిషత్ అవార్డులు లభించాయి అని మంత్రి తెలిపారు.    గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం, నూతన పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ సర్పంచులు ప్రజాప్రతినిధులు అధికారులు చేసిన కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తున్నాం అని మంత్రి అన్నారు. కొడిమ్యాల మండలం ప్రజా పరిషత్ స్ఫూర్తితో జిల్లాలోని ప్రతి గ్రామం మండలంలో అభివృద్ధి పనులు పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సూచించారు.   తెలంగాణ గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి నెలా తప్పనిసరిగా 330 కోట్ల నిధులను విడుదల చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ బిజెపి పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.   దేశంలో 18 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకం సైతం ఆ రాష్ట్రాలలో  అమలు కావడం లేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సైతం 600 వృద్ధాప్య పెన్షన్ అందిస్తారని, మన రాష్ట్రంలో 2016 ఆసరా పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.    గతంలో కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు ఎరువులు సైతం లభించలేదని, వారు రైతు భరోసా సభలు పెట్టడం హాస్యాస్పదమని మంత్రి  అన్నారు.    దేశంలో రైతాంగానికి నిజమైన రైతు భరోసా సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోలు,24 గంటల ఉచిత  నాణ్యమైన విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా, ఉద్యానవన పంటలు ప్రోత్సాహకం ,వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలను అమలు చేస్తున్నారని, దేశంలో మరే రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ల చర్యలు తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.   కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 గంటలు సైతం విద్యుత్ సరఫరా కాక పంటలు ఎండిపోయాయని, ప్రస్తుతం నాణ్యమైన విద్యుత్ 24 గంటలు సరఫరా చేయడం వల్ల రైతులకు చాలా ఉపశమనం కలిగిందని మంత్రి తెలిపారు. 23 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.   రైతుల భూ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ధరణి వెబ్ పుటలను సీఎం కేసీఆర్ రూపొందించారని, వాటి వల్ల పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుందని మంత్రి తెలిపారు.   రైతులకు ఉపయోగకరంగా ఉన్న ధరణి వెబ్ సైట్ ను రద్దు చేస్తామని ప్రకటించడం దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమేనని, దళారీల తో కొమ్ముకాసిన కాంగ్రెస్ నాయకుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు.  తెలంగాణ ప్రభుత్వం  ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం లేదని మంత్రి తెలిపారు.    కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు మండల ప్రజా పరిషత్ అవార్డులు సాధించాయి, అందులో కొడిమ్యాల మండలం ఒకటి కావడం గర్వకారణమని ఆయన అన్నారు.   అవార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలను ఆయన అభినందించారు, భవిష్యత్తులో సైతం ఇదే స్ఫూర్తితో పని చేసి మరి ఎన్నో అవార్డులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.  కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయడం వల్ల అనేక అవార్డులు సాధిస్తామని అన్నారు.   చొప్పదండి పోలీస్ స్టేషన్ కు 2 సార్లు జాతీయ అవార్డులు, పురపాలక సంఘానికి 3 సార్లు జాతీయ అవార్డులు, ప్రస్తుతం కొడిమ్యాల మండల ప్రజా పరిషత్ జాతీయ అవార్డు లభించడం గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు.   పల్లె ప్రగతి కింద సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితంగా గ్రామాల్లో స్వరూపం మారిపోయిందని, ప్రతి గ్రామంలో పచ్చని చెట్లు నాటి సంరక్షిస్తున్న మని అన్నారు. గ్రామాలలో నర్సరీ ,స్మశానవాటిక డంపింగ్ యార్డ్, ట్రాక్టర్, యాంకర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు లో రికార్డు సమయంలో పూర్తి చేయడం వల్ల వరద కాలువ జీవనదిగా మారిందని, చొప్పదండి ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.   కొడిమ్యాల మండలంలోని దామయ్యపేట గ్రామం లో 1 కరోణ కేసులు సైతం నమోదు కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  అనంతరం కొడిమ్యాల మండల ప్రజా పరిషత్ ఎంపీపీ శ్రీమతి స్వర్ణలత రాజ నరసింగ రావులను , వివిధ గ్రామాల సర్పంచులను, అధికారులు, సిబ్బందిని తదితరులు ను ఘనంగా సన్మానించారు.   శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, జెడ్పిటిసిలు, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్లు  ,ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయడమైనది
దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Share This Post