దేశానికి దశా దిశ విద్యార్థులే – జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

దేశానికి దశా దిశ విద్యార్థులే – జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

 

విద్యార్థులు చదువుతోపాటు ఆట పాట మాటల్లో రాణించాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.

వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ, ద్వారా జిల్లా కలెక్టర్ రూపకల్పనతో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆట, పాట, మాటలతో ఆకట్టుకున్న విద్యార్థినిలు, ఇదే స్ఫూర్తితో తోటి విద్యార్థులకు నేర్పి వేసవి శిక్షణ శిబిరం ఆశయాలను సద్వినియోగం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ విద్యార్థులను సూచించారు. బుధవారం 5,6,7వ తరగతి  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు బాలికలకు గిరిజన ఆశ్రమ పాఠశాల, కల్వకుర్తి లో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ…. పదిహేను రోజుల వేసవి శిక్షణ శిబిరంలో ఆంగ్లము, లెక్కల సబ్జెక్టు లో  విద్యార్థులు ఉన్న భయాలను తొలగించుకుని ఉత్తమ ప్రతిభ కనపరచడం అభినందనీయమన్నారు.

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే

15 రోజుల ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

దేశానికి దశ దిశ విద్యార్థులని వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత ఉత్తమంగా రాణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ శిక్షణ తరగతులకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించి విజయవంతం చేశారని కొనియాడారు.

15 రోజుల పాటు నేర్చుకున్న అంశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మాటలను విద్యార్థులు ప్రదర్శించారు.

లెక్కలు, భాషల పై భయాన్ని పోగొట్టడమే కాకుండా ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నేర్చుకునే అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ అభినందించారు.

పదిహేను రోజుల్లో పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో వేసవి శిక్షణ శిబిరం విజయవంతం అయింది అన్నారు.  శిక్షణ శిబిరంలో గణితంలో చతుర్విధ ప్రక్రియలు కనీస సామర్ధ్యాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు నగదుతో పాటు సర్టిఫికెట్ను ప్రధానం చేశారు.

సంస్కృతి కార్యక్రమాలను విద్యార్థులకు నేర్పించి ఉత్తమంగా ప్రదర్శింప జేసిన సమాచార శాఖ కళాకారులను అభినందించి కలెక్టర్ సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ కన్వీనర్ మాధవరెడ్డి పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లో ఉత్సాహం, ప్రేరణ నింపేవిధంగా వారితో మాట్లాడించి వారికి జ్ఞాపికలు ప్రదానం చేశారు.

విద్యార్థుల పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తన ఆలోచనలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలని ఈ శిక్షణ శిబిరం నిర్వహించడం చాలా సంతోషాన్నిచ్చింది అన్నారు.

ఇలాంటి శిబిరాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించాలని వారు కోరారు.

పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఈ శిబిరం ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ గోవిందరాజులు, పి.ఓ ఐ.టి డి.ఏ అశోక్, సెక్టోరల్ అధికారి బరపటి వెంకటయ్య, ఎంఇఓ బాసు నాయక్, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్,  విద్యార్తులు పాల్గొన్నారు.

Share This Post