దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం:: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్ధం

జూన్ 02 ఖమ్మం:

క్రొత్త రాష్ట్రం ఏర్పడ్డ అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెవిలియన్ గ్రౌండ్స్ వద్ద గల అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అక్కడి. నుండి పోలీసు పెరేడ్ గ్రౌండ్లో పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల లక్ష్యం, సాధించిన ప్రగతిని వివరించారు. ఈ వేడుకల్లో వీణా నృత్యాలయం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా మంత్రి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. కార్యక్రమంలో దళిత బంధు లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. అందుల్లో 16 హార్వెస్టర్ లు, 14 జేసిబిలు, 16 డిటిపి జిరాక్స్ యూనిట్లు , 10 ఫోటోగ్రఫీ, 10 కుట్టు మిషన్లు, 2 సెంట్రింగ్, 1 అంబులెన్స్, 1 ఎజాక్ కాంక్రీట్ మిక్స్ , 4 మొబైల్ టిఫిన్ సెంటర్, 10 డీజె సౌండ్, 2 అల్యూమినియం యూనిట్లలను లబ్దిదారులకు అందజేశారు.

ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్, స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, మధుసూదన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, డిసిఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, ఏఎంసి చైర్మన్ లక్ష్మీప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post