దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజ్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాగర్ కర్నూల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 10.30 కు ముఖ్య అతిథి గువ్వల బాలరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో పోలీస్ కవాతు, వివిధ శాఖల ద్వారా రూపొందించిన శకటాలు, జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిద శాఖలకు సంబంధించి అభివృద్ధి సాధించిన అంశాల పై స్టాల్స్ చూపరులను ఆకర్షించాయి. స్వాత్రంత్య వేడుకల సందర్బంగా ముఖ్య అతిథి గువ్వల బాలరాజ్ జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి
75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా స్వాతంత్ర్యం కొరకు తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన మహానీయలను స్మరించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టుబ్8 నుండి ఆగస్టుబ్22 వరకు వేడుకలు జరుపుకుంటుందన్నారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం ద్వారా ప్యావేశ పెడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలో వివిధ శాఖల ద్వారా సాధించిన లక్ష్యాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు కుదించిన కారణంగా జిల్లాలో కొత్తగా 23,486 మందిని కొత్త ఆసరా పింఛన్కు అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపారని, నేడు పదిమందికి ముఖ్యఅతిథి చేతుల మీదుగా ఆశరా పింఛన్ ఐడి కార్డును అందజేశారు.
విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.
సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాలల వారిగా విద్యార్థులకు మెమొంటోలను అందజేశారు.
శకటాల నిర్వహణలో అటవీ శాఖ శకటానికి మొదటి బహుమతి డిఆర్డిఏ శకటానికి రెండో బహుమతిని అందజేశారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాళ్లను పరిశీలించి అధికారులను అభినందించారు.
వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
జిల్లా అధికారుల్లో అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి వి రమేష్, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 122 మంది ఉద్యోగస్తులకు ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేశారు.
అంతకుముందు స్వాతంత్ర సమరయోధులు దాస ఉషనయ్య, వెంకట్రావు, అంబటి నీలావతి లకు శాలువాతో సత్కరించి పాదాభివందనం చేశారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు గ్రామాల సర్పంచులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ కే. మనోహర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య, శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మను చౌదరి, మోతిలాల్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా పాత్రికేయులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Post