దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి, చైర్మన్ తెలంగాణా రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ రాష్ట మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మ రెడ్డి, చైర్మన్ తెలంగాణా రాష్ట్ర మహిళా కమిషన్  జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నారాయణపేట  పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.  ఉదయం 10.30 కు ముఖ్య అతిథి సునీత లక్ష్మ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ వేడుకల్లో పోలీస్ కవాతు, వివిధ శాఖల ద్వారా రూపొందించిన  శకటాలు, జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక  కార్యక్రమాలు,  వివిద శాఖలకు సంబంధించి అభివృద్ధి సాధించిన అంశాల పై స్టాల్స్ చూపరులను ఆకర్షించాయి.  స్వాత్రంత్య వేడుకల సందర్బంగా ముఖ్య అతిథి సునీత లక్ష్మ రెడ్డి జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి  75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా స్వాతంత్ర్యం కొరకు తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన మహానీయలను స్మరించుకోవడానికి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 8 నుండి ఆగస్టుబ్22 వరకు వేడుకలు  జరుపుకుంటుందన్నారు.  ఈ వేడుకల్లో జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను  జిల్లాలో వివిధ శాఖల ద్వారా సాధించిన లక్ష్యాలను ప్రజలకు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు కుదించిన కారణంగా జిల్లాలో కొత్తగా 13,476 మందిని కొత్త ఆసరా పించన్లు అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపారని, నేడు పదిమందికి ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆసరా పింఛన్ ఐడి కార్డును అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.

శకటాల నిర్వహణలో వైద్య ఆరోగ్య  శాఖ శకటానికి మొదటి బహుమతి హర్టికల్చర్  శకటానికి రెండో బహుమతిని అందజేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాళ్లను పరిశీలించి అధికారులను అభినందించారు. వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా అధికారుల్లో తహసిల్దార్ లకు వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 140  మంది ఉద్యోగస్తులకు అలాగే ఉతమ గ్రామా పంచయతిలకు  ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి హరిచందన , జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వనజమ్మ, జిల్లా అదనపు యస్పి భరత్,  శాసనసభ్యులుయస్ రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి,  మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసుయ చంద్రకాంత్ వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా పాత్రికేయులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Post