దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆదర్శ భావాలు కల్గిన మహోన్నత వ్యక్తి. అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు.

దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు.
          ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్  చిత్ర పటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
         ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి రోజైన అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. దేశ ప్రజలను ఐక్యతా భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని అన్నారు.
     జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించినట్లు ఆయన వివరించారు.
              ఈ కార్యక్రమంలో  ఆర్. డి.ఓ రాజేంద్ర కుమార్, బి.సి. సంక్షేమ అధికారి శంకర్, డి.పి. ఓ యాదయ్య, ఏ. ఓ శ్రీదేవి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post