దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకుంటున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, డి ఆర్ ఓ ,లింగ నాయక్ అన్నారు .

దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకుంటున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, డి ఆర్ ఓ ,లింగ నాయక్ అన్నారు .
ఆదివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డి ఆర్ ఓ ,లింగ నాయక్ మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి రోజైన అక్టోబరు 31వ తేదీన “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలను ఐక్యతా భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని, స్వేచ్ఛా, స్వాతంత్రం ఫలాలను మనమందరం పొందుతున్నట్లు డి ఆర్ ఓ తెలిపారు. భారత దేశ తొలి ఉప ప్రధానిగా, హోం శాఖ మంత్రిగా దేశాన్ని ఐక్యంగా తీర్చిదిద్దారు. ఆయన మనందరిలో సమైక్య స్ఫూర్తి నింపారన్నారు. భారత హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశంలోని 565 సంస్థానాలను భారత ప్రభుత్వంలో ఆయన విలీనం చేయడం జరిగిందనీ, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయుటకు నాంది పలికినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ బలరాం, జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post