దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది – జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ

*ప్రతి ఎన్నికలో ఖచ్చితంగా ఓటు వేస్తాం

*పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు

*సినియర్ ఓటర్ల స్పూర్తి ఆదర్శప్రాయం

*జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలో పాల్గోన్న జిల్లా కలెక్టర్
—————————–
పెద్దపల్లి, జనవరి – 25:
—————————–
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంటుందని, దీనిని అందరు గుర్తుంచుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ లు వి.లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకొని, ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించుకుంటుందని అన్నారు.
2011 నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు

జిల్లాలో ఇటీవలే ఓటరు జాబితా సవరణ పూర్తి చేసి , 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు అందించామని, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఉండే నేపథ్యంలో మరోసారి సైతం ఓటరు జాబితా సవరణ చేపట్టి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని అన్నారు.

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రూపోందించిన పాట మనమంతా చుసామని, భారత దేశ భవిష్యత్తు ఖచ్చితంగా ఓటరు చేతిలో ఉంటుందని, ఎన్నికల సమయంలో సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు

ఓటరుగా మనమంతా బాధ్యతగా వ్యవహరించాలని, ఓటు హక్కు వినియోగించుకోవటంలో గర్వపడాలని , సినియర్ ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వేస్తూ మనకు ఆదర్శంగా ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే స్లోగన్ తో నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగం ఆవశ్యకత పట్ల వివరించి ఓటు వేయడం అనేది మన బాధ్యత అని తెలియజేశారు.

ఓటరు దినోత్సవం వేడుకలో అందరితో ఓటు హక్కు వినియోగం సంబంధించిన ప్రతిజ్ఞ కలెక్టర్ చేయించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉన్న 5గురు సినియర్ సిటిజన్ లకు కలెక్టర్ సన్మానం చేశారు. జిల్లాలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు సక్రమ మార్గంలో దేశ భవిష్యత్తు దృష్ట్యా ఉపయోగించాలని సూచిస్తూ ఓటరు గా నమోదు చేసుకున్నందుకు వారిని కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవ రావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ.కే.వై.ప్రసాద్ , తాహాసిల్దార్ వెంకటలక్ష్మి, ఎలక్షన్ డి.టి.ప్రవీణ్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post