ఈరోజు మా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని సిద్దిపేట పట్టణంలోని ఎస్ ఎస్ గార్డెన్స్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ ముజ్ మిల్ ఖాన్ గారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు పిల్లల పైనే ఆధారపడి ఉందని పిల్లలందరూ అటువంటి అలవాట్లు మంచి ఆరోగ్యంతో క్రమశిక్షణతో సహాయ గుణం తో మెదులుతూ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దేశ భవిష్యత్తు లో భాగస్వాములు కావాలని తెలిపారు. ఒక బండరాయి నుండి ఎంత కష్టపడితే అద్భుతమైన శిల్పం వస్తుందో అదేవిధంగా విద్యార్థి దశ నుండి పిల్లలందరూ కష్టపడి అనుకున్న గమ్యాలను చేరేవరకు శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. మార్పు అనేది మన నుండి మొదలై, చాలా మంది జీవితాలను ప్రేరేపించి ఆదర్శవంతంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు పిల్లలతో మమేకమై సరదాగా బాలల దినోత్సవం ప్రాముఖ్యత గురించి సంభాషించారు, చివరగా పిల్లలంతా క్రమశిక్షణతో ఆరోగ్యంతో స్నేహభావంతో విద్యనభ్యసించి మంచి ఆశయంతో రాణించి దేశ భవిష్యత్తు లో భాగస్వాములు కావాలన్నారు, బాలల వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా గా కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ తరఫున కొవిడ్ బాధిత కుటుంబాలకు బాల సహాయ కిట్లను నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి గారు అడిషనల్ డిసిపి శ్రీనివాస్ గారు, బీసీ సంక్షేమ అధికారి సరోజ గారు, సెక్టోరల్ ఆఫీసర్ రమేష్ గారు, బాలల సంక్షేమ సమితి సభ్యులు నరసింహులు, మంజుల, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ మమతా గారు,జిల్లా బాలల సంరక్షణ అధికారి రాము గారు, సిడిపివో విజయలక్ష్మి గారు, కేర్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ భవాని శంకర్ గారు, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, బాలల పరిరక్షణ విభాగం అధికారులు మరియు childline సిబ్బంది పాల్గొన్నారు.