దేశ విదేశాలను ఆకర్షించే విధంగా నాణ్యమైన పంటల ఉత్పత్తులు ఉండాలి జిల్లా కలెక్టర్ B.గోపి

స్వాతంత్ర సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా వాణిజ్య ఉత్సవం,ఎక్స్పోర్ట్ కాంక్లేవ్ పేరిట పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం సదస్సును నిర్వహించారు.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ బి గోపి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మిర్చి పంటకు దేశం లోనే మంచి పేరు ఉందని జిల్లాలో మిర్చి, పసుపు, పత్తి ఉత్పత్తులను పెంచే దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

రైతులకు లాభదాయకమైన పంటలపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

డిమాండ్ కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు పంటల మార్పిడి విధానాన్ని రైతులు అవలంబించేలా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమలను నిర్వహించాలన్నారు.

స్పైసెస్ బోర్డు డైరెక్టర్ లింగప్ప మాట్లాడుతూ మన జిల్లాలో పండుతున్న మిర్చి,పసుపు బంగ్లాదేశ్చై, చైనా,పాకిస్తాన్ దేశాలకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని… సుమారుగా 6 వేల కోట్ల రూపాయల మిర్చి పంట ట్రాన్స్పోర్ట్ అవుతుందని… మిర్చి లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందని.. పసుపు పండించడంలో మన రాష్ట్రం ప్రథమంలో ఉందని లింగప్ప తెలిపారు.

అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు పెద్దవి పెట్టాలని 46 శాతం తమిళనాడు రాష్ట్రం లోనే ఉన్నాయని తెలిపారు.

జిల్లాలో టెక్స్టైల్ రంగానికి రాయితీలు ఎక్కువగా ఇవ్వాలని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, drdo pd సంపత్ రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నరసింహ మూర్తి, లీడ్ బాంక్ మేనేజర్ సత్యజిత్, ఎంపీడీవోలు వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు, ఎగుమతి, దిగుమతి దారులు పాల్గొన్నారు.

Share This Post