దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వము త్యాగంచేసి పోరాడి అసువులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలంగ మనమీనాడ్ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని అదనపు కలెక్టర్ యస్ మోహనరావ్ తెలిపారు

జనవరి 30, 2023

దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వము త్యాగంచేసి పోరాడి అసువులు బాసిన ఎందరో మహానుభావుల పుణ్య ఫలంగా మనమీనాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నామని, ఈ సందర్భంగా వారి చిరస్మరణీయమైన సేవలు స్మరించుకొని వారి ఆశలు, ఆశయాలకనుగుణంగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ యస్ మేహన్ రావు పిలుపునిచ్చారు. జాతిపిత మహాతా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదరపు కలెక్టర్ మాట్లాడుతూ సహాయ నిరాకరణ, సత్యాగ్రహమనే ఆయుధాలతో అహింసా మార్గంలో స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధుడు మహాత్మా గాంధీ అని, ఆయన వర్ధంతి సందర్భంగా స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకొని రెండు నిముషాలు మౌనం పాటించుటకు ప్రతి ఏటా ఈ రోజు సమస్మరణ దినోత్సవాన్ని దేశమంతటా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆ మహనీయుల ఆత్మశాంతికై అధికారులతో సహా ఉద్యోగులందరూ రెండు నిముషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీదేవి జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
———————————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం సూర్యాపేట వారిచే జారీ చేయనైనది.

 

Share This Post