ధరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగడానికి వీలులేదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం.5

ధరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగడానికి వీలులేదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

తేదిః 21-10-2021
ధరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరగడానికి వీలులేదు :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అక్టోబర్ 21: వివిధ సమస్యలపై వచ్చే ధరఖాస్తులపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సర్వీసులు, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేరువెరుగా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలక్టర్ మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ ధరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, శాసన సభ్యుల అనుమతులకు పంపిన ధరఖాస్తుల పురోగతిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బడ్జెట్ ప్రకారం ధరఖాస్తులపై చర్యలు తీసుకోని లబ్దిదారులకు చెక్కులను అందించాలని సూచించారు. ఎఫ్ లైన్ పిటీషన్లపై ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవాలని, సర్వెయర్లులేనట్లయితే మరోకరిని డిప్యూటేషన్ సర్వెయర్లను వాడుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ప్రజావాణిలో వచ్చిన పిటీషన్ల పరిష్కరించాలని, భూసమస్యలపై వచ్చే ధరఖాస్తులపై సమీక్షించుకొని శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ధరణి స్లాట్ బుక్కింగ్, పెండింగ్ మ్యూటేషన్లపై త్వరగా చర్యలు తీసుకోవాలని, జిఎల్ఎమ్ భూవివాదాలు, పిఓబి ధరఖాస్తులపై స్వయంగా పరీశీలించి వివరణను క్షుణంగా పేర్కోంటు నివేధికను అందించాలని పేర్కోన్నారు. తహసీల్ కార్యాలయాలలో మాన్యువల్ ఫైళ్ల నిర్వహణ జరగకుండా పూర్తిస్థాయిగా ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లపై జరగాలని అదేశించారు. అధికారులు అక్రమ ఇసుక పై తీసుకునే చర్యలపై చట్టంప్రకారమే వ్యవహరించాలని, జిల్లాలో అక్రమ ఇసుక రవాణ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
మెగా పల్లెప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించడం జరిగిందని, ఎక్కడైన సమస్యలు ఉన్నట్లయితే వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని, ఎస్సి కమ్యూనిటి వారికి ఇచ్చిన భూముల వివరాలను తెలుసుకోవాలని నివేధికను అందించాలని తెలిపారు.
క్షేత్రస్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన మేర సరిగా కావడం లేదని, మొదటి డోస్, రెండవ తీసుకున్న వారి వివారాలు ఓటరు జాబితా ఆదారంగా సరిచూసుకోవాలని, ఇతర ప్రాంతాలలో నివసిస్తూ, అక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను కూడా తెలియజేయాలని, మరణించిన వారి వివరాలను. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలు సేకరించి నిర్థేశిత జాబితా ద్వారా తెలియజేయాలని సూచించారు. వ్యాక్సిన్ ప్రాదాన్యతను ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ప్రదానంగా వ్యవహరించాలని, పోలింగ్ కేంద్రంవారిగా ఇంకా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించేలా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి మొదటి వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించడం మాత్రమే కాకుండా అక్కడ ఎదురయ్యే సమస్యలను గురించి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సూచించారు. మొదటి వ్యాక్సిన్ పూర్తయి రెండవ వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్నవారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించాలని, వ్యాక్సిన్ అందించడంలో అధికారులు లక్ష్యాలను నిర్ణయించుకొని ఆదిశగా త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పై నెలకోన్న సందేహాలను నివృత్తి చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కమ్యూనిటి పెద్దలు, వైద్యాధికారులు మొదలగు వారితో సందేహలను నివృత్తి చేసి వారికి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానికసంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు శ్రీమతి ఆర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్, పిడిఆర్డిఓ ఎస్. వినోద్ జిల్లా వైద్యాధికారి డా. పి. శ్రీధర్, ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు , మున్సిపల్ కమిషనర్లు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post