ధరఖాస్తుల పరిష్కారంలో అలస్యం కాకుండా చూడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం.. 3 తేదిః 02-12-2021
ధరఖాస్తుల పరిష్కారంలో అలస్యం కాకుండా చూడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 02: వివిధ సమస్యల పరిష్కారం కొరకు వచ్చే ధర్వాస్తులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు అలస్యం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అనారు. గురువారం సాయంత్రం వివిధ రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ ధరఖాస్తులు పెండింగ్ లేకుండా సమీక్షించి బడ్జెట్ ప్రకారం లబ్దిదారులకు చెక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బి ఆండ్ ఎస్స్ ఎల్ ఏ లో పెండిగ్ లో ఉన్న ఎఫ్ లైన్, ఇతర పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని, ధరణి స్లాట్ బుక్కింగ్ పెండింగ్ లేకుండా చూడాలని, పెండింగ్ మ్యూటేషన్లు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని, భూ సమస్యల పరిష్కారం కొరకు వచ్చిన ధరఖాస్తులు, పిఓబి లపై చర్యలు తీసుకోవడంలో అలస్యం కాకుండా చూడాలని, చర్యలు తీసుకునే ప్రతి ధరఖాస్తును క్షుణంగా పరిశీలించిన తరువాత మాత్రమే చర్యలు తీసుకోవాలని, స్పెషల్ సమ్మరి రివిజన్ లో బాగంగా ధరఖాస్తులపై ఆదేశాల మేరకు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సర్టిఫికేట్ జారిలో అన్ లైన్ ద్వారా వచ్చిన ధరఖాస్తులపై దృవీకరించుకోవాల్సి ఉందని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కాకుండా, ఇతర కుటుంబ సభ్యులు ధరఖాస్తు చేయడంలో జారిచేయడంలో జాగ్రత్తగా చూడాలని, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వనట్లయితే ఏఓ కలెక్టర్ గారికి ద్వారా పంపించాలని అన్నారు. కోవిడ్ డెత్ కేసుల పై వచ్చిన ధరఖాస్తులను కమిటి సభ్యులు దృవీకరించిన వాటిని మాత్రమే డాటా ఎంట్రి చేయాలని, కోత్తగా ఎవి తీసుకోరాదని, వచ్చినవి మిస్ కాకుండా చూడాలని అన్నారు.
దాన్యం సేకరణ ప్రతి రోజు ఎటువంటి ఇబ్బందులకు అస్కారం లేకుండా సజావుగా జరుగుతుందని, మిల్లుల వద్ద అన్ లోడింగ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కోన్నారు.

ధరఖాస్తుల పరిష్కారంలో అలస్యం కాకుండా చూడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post