ధరణికి సంవత్సరం పూర్తి.. జిల్లాలో విజయంతంగా ధరణి అమలు… కలెక్టర్ నిఖిల

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించారని, నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకొని, దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన మార్పని, ధరణి కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోందని జిల్లా కలెక్టర్ నిఖిల కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ఉత్సవ కార్యక్రమంలో తెలియజేసినారు.

ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉందని, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ అని కలెక్టర్ సూచించారు.
భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందన్నారు.
వికారాబాద్ జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోంది. ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న జిల్లాలోని సహచర అధికారులు, తహసీల్దార్లు, మండల అధికారులను అభినందిస్తున్నానని కలెక్టర్ తెలిపారు.
ఈ విషయంలో తమ పూర్తి సహాయ, సహకారాలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని అందింస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.
ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. అప్పుడు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి కావు. ఇప్పుడు జిల్లాలో ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలియజేసినారు.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయన్నారు. ధరణి ప్రారంభానికి ముందు దీనికి గంటలు, గంటల సమయం పట్టేదని, గతంలో తక్కువగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవని తెలిపారు.
ధరణిలో ప్రత్యేకతలలో టాంపర్ ప్రూఫ్ పౌరులకు అనువుగా ఉండడం. తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం. పారదర్శకత. ఆధునిక సాంకేతికత వినియోగం. వివక్షకు తావులేకుండా ఉండడం. అతితక్కువగా అధికారుల జోక్యం ఉంటుందన్నారు.
అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం. బయో మెట్రిక్ నిర్ధారణ. ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ. రిజిస్ట్రేషన్లతో పాటే మ్యుటేషన్. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం. ఆన్లైన్ చెల్లింపులు లాంటి ప్రత్యేకతలుఉన్నాయన్నారు. అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ, పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా. నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం.
నిత్యం పెరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత అని తెలియజేసినారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.
జిల్లాలో ఇప్పటి వరకు ధరణి పోర్టల్ ద్వారా 90,201 స్లాట్ లు బుక్ కాగా, 85,619 ఫిర్యాదులను పరిష్కరించి 94.92 శాంతం లక్ష్యం సాధించడమైందన్నారు. అపరిష్కృతంగా ఉన్న 4,582 ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ నిఖిల ఈ సందర్బంగా తెలియజేసినారు.
మండలాల వారిగా జిల్లాలో మొదటి స్థానంలో పూడూర్ మండలంలో 15133 ఫిర్యాదులు ధరణి ద్వారా అందగా 14287 పరిష్కరించడం జరిగిందని, అలాగే పరిగిలో 13734 కు, 12939, దోమలో 12396 కు 11667,
కుల్కచర్లలో 12045 కు 11345,
నవాబుపేటలో 4509 దరఖాస్తులకు 4259 పరిష్కరించడం జరిగిందన్నారు. మోమిన్ పెటలో 4247 కు 3962,
మార్పల్లిలో 4019 కు 3880,
వికారాబాద్ లో 3618 కు 3432,
కొడంగల్ లో 2722 కు, 2672,
ధరూర్ లో 2730 కి 2655,
బొంరాస్ పెటలో 2675 కు, 2606,
దౌల్తాబాద్ లో 2388 కు 2304,
పెద్దములు లో 1809 కు 1756,
తాండూర్ కు 1750 కు 1669,
యాలాల లో 1666 కు 1589,
బషీరాబాద్ లో 1607 కు 1558,
కోటపల్లి లో 1541 కు 1485,
బంట్వారం లో 1123 కు 1073
అలాగే చౌడాపూర్ కొత్త మండలంలో 489 ధరణి ద్వారా భూ సమస్యలపై ఫిర్యాదులు అందగా, 454 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ నిఖిల తెలియజేసినారు.
నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్వి జ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పూడూర్ తహసీల్దార్ కిరణ్ కు, పరిగి తహసీల్దార్ విద్యాసాగర్ రెడ్డి కి, దోమ తహసీల్దార్ వహీదా ఖాతూన్ లను శాలువాలాతో ఘానంగా సన్మానిచారు. ఈ సందర్బంగా కలెక్టర్ కేక్ కట్ చేసినారు. రెవిన్యూ సిబ్బంది కూడా ఈ సందర్బంగా కలెక్టర్ కు శాలువతో సన్మానంంచారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, వికారాబాద్ ఆర్ డి ఓ ఉపేందర్ రెడ్డి లతో పాటు అన్ని మండలాల తహసీల్దార్లు కలెక్టర్ కార్యాలయ రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post