ధరణితో భూసమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు చేరుకున్న ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు ధరణిపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 06–05–2022

 

ధరణితో భూసమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు చేరుకున్న ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు

ధరణిపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్ హరీశ్,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన ధరణితో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులతో శిక్షణలో భాగంగా  శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీశ్ను కలిసి పరిచయం చేసుకొన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణిపై కలెక్టర్ హరీశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం,  ప్రత్యేకంగా  ప్రవేశపెట్టిన ధరణి ద్వారా భూసమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ధరణి పోర్టల్లో భూములకు సంబంధించిన వివరాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి రక్షణతో కూడుకొని ఉంటాయని తెలిపారు. దీనికిగాను సంబంధిత అధీకృత రెవెన్యూ అధికారులు మాత్రమే ధరణిలో ఏమైనా మార్పులు, చేర్పులు చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ధరణిలో రికార్డుల భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని కలెక్టర్ హరీశ్ వారికి పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా ఈ సందర్భంగా స్పష్టం చేసినారు. అనంతరం ట్రైనీ అధికారులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు.  భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ధరణి సాఫ్ట్ వేర్ రూపొందించిందని, దీని ద్వారా భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన లావాదేవీలను నిమిషాల వ్యవధిలో ఆన్లైన్లో పూర్తి చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. మంచి విజన్ తో, పారదర్శక మైన రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను  తయారు చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ధరణి సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, సి సి ఎల్ ఏ,అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్ , జిల్లా కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post