ధరణిలో అధికారుల పనితీరు బేష్/సిఎంఆర్ రైస్ డెలివరిలో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకట తేదిః 28-10-2021
ధరణిలో అధికారుల పనితీరు బేష్/సిఎంఆర్ రైస్ డెలివరిలో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అక్టోబర్ 28: ధరణిలొ అధికారుల బాగా పని చేస్తున్నందుకు రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ జి. రవి అభినంధించారు. జిల్లాలో వివిధ రెవెన్యూ సమస్యలు మరియు సి.ఎం.ఆర్. డెలివరీ పై తహసీల్దార్లు, సివిల్ సప్లై, రైస్ మిల్లర్లు, ఇతర అధికారులతో జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న ప్రతి ధరఖాస్తుపై చర్యలు తీసుకోవాలని, కళ్యాణా లక్ష్మి, షాధిముబారక్ ధరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కాకూడదని, నిధుల అందుబాటు ప్రకారం వెంటనే ధరఖాస్తులపై చర్యలను పూర్తిచేసి లబ్దిదారులకు చెక్కులను అందించాలని అన్నారు. పెండింగ్ గ్రీవేన్స్, ధరణి స్లాట్ బుక్కింగ్ లో పెండింగ్ లేకుండా చూడాలని, పెండింగ్ మ్యూటేషన్ మరియు వివిధ దృవీకరణల జారిలో పెండింగ్ లేకుండా చూసి చర్యలు తీసుకోవాలని, తహసీల్దార్లు అవసరమైతే క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీలు నిర్వహించి, ఎటువంటి సమస్యలకు తావు లేకుండా సరైన దృవీకరణలతో చర్యలు తీసుకోవాలని. సక్సేషన్ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని, పిపిబి కోర్టు కేసులపై నివేధికలను సమర్పించాలని, ఆర్డర్ హైకోర్టు నుండి వచ్చిందా సరి చూడాలని, ఆర్డిఓ, జేసి మరియు సివిల్ లేదా హైకోర్టు నుండి వచ్చిన ఆర్డర్ లను సరిచూడాలని, ఈ ఆఫీస్ లో ఫైల్ పెండెన్సి లేకుండా చూసేలా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు కార్యాలయాలకు వచ్చే ధరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణ జరుగకుండా, టోకెన్ సిస్టం ద్వారా ఇసుక పంపిణి జరిగేలా చూడాలని, తద్వారా అక్రమ రవాణా జరగకుండా చూడగలుగుతామని పేర్కోన్నారు. వ్యాక్సినేషన్ చేస్తున్నప్పుడు ఓటరు జాబితాలో చనిపోయిన వారిని గుర్తించడం జరిగిందని వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వివరాలను జాబితా నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ఆసైన్డ్ కాకండా అన్ ఫిట్ ఫర్ కల్టివేషన్ గా ఉన్న వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. పట్టాలు జారి చేసి పోజిషన్ చూపించని వాటిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని, ఎస్సి కమ్యూనిటి వారికి, ట్రైబల్ గిరివికాసం కొరకు కేటాయించిన భూములపై చర్యలు తీసుకోవాలని, మోగా పిపివి కొరకు అటవి ప్రాంతాన్ని అభివృద్ది చేసేలా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.
యాసంగి సీజన్ కి సంబంధించి 5.53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 63 బాయిల్డ్ రైస్ మిల్లులకు అందించామని,సీఎంఆర్ 3.76 లక్షల మెట్రిక్ టన్నుల కు గాను ఇప్పటి వరకు 1.14 మెట్రిక్ టన్నుల రైస్ అందించాలని, ఇంకా 2.62లక్షల మెట్రిక్ టన్నుల డెలివరి చేయవలసి ఉందని, వీటిని నవంబర్ 30 వరకు ఎఫ్ సి ఐ కి సీఎంఆర్ పూర్తి చేయవలసినదిగా రైస్ మిల్లర్లకు ఆదేశించారు.ప్రతి రైస్ మిల్లుకి డిటి స్థాయి అధికారిని నియమించి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులును ఆదేశించారు. రైస్ తరలింపుకు స్పేస్ సమస్య మరియు హమాలిల కొరత రాకుండా చూసుకొనగలరని ఏరియా మేనేజర్ ఎఫ్ సి ఐను ఆదేశించారు. రైస్ మిల్లర్లు ప్రతి రోజు 24గంటలు మిల్లింగ్ చేసి గడువు సీఎంఆర్ బాయిల్డ్ రైస్ డెలివరి పూర్తి చేయాలని కోరినారు. జిల్లాలో ఉన్న ప్రతి రైస్ మిల్లు రోజుకు 3000 మెట్రిక్ టన్నుల రైస్ ఉత్పత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆర్.డి.ఓలు, తహసీల్దార్లు, సివిల్ సప్ప్లై అధికారులు, రైస్ మిల్లర్లు, ఏఫ్.సి.ఐ. అధికారులు, డి.టి.లు , తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ధరణిలో అధికారుల పనితీరు బేష్/సిఎంఆర్ రైస్ డెలివరిలో వేగం పెంచాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌర సంబంధాల అధికారి చే జారీ చేయనైనది.

Share This Post