ధరణిలో కొత్త మాడ్యుల్స్ తో సమస్యలు పరిష్కారం…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ధరణిలో కొత్త మాడ్యుల్స్ తో సమస్యలు పరిష్కారం…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, మే -09:

రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో కొత్త మాడ్యుల్స్ తో సమస్యలు పరిష్కరించుకొనుటకు అవకాశం కల్పించిందనీ జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.

పేరు మార్పిడి:-

ధరణి లో పేరు మార్పిడి అవకాశం కల్పిస్తూ పొరపాటున పట్టాదారు గా వేరే పేరు పడిన, ఆంగ్ల భాషలో అక్షర దోషాలు ఉన్న సవరించుకోవచ్చని తెలిపారు.

భూమి స్వభావం:-

భూమి స్వభావం పట్టా, సీలింగ్, భూదాన్, అసైన్డ్ వాటివి తప్పుగా నమోదు అయిన వాటిని సరి చేసుకోవచ్చని తెలిపారు.

భూమి వర్గీకరణ (ల్యాండ్ క్లాసిఫికేషన్):-

భూమి వర్గీకరణ లో మాగాణి, తరి, మెట్ట వంటి వివరాలను మార్చుకోవచ్చు అని తెలిపారు.

భూమి సంక్రమణ రకం:-

భూమి ఏ విధంగా సంక్రమించిందో వివరాలు తప్పుగా నమోదైత మార్చుకోవచ్చు అని తెలిపారు.

భూ విస్తీర్ణం సవరణ (పరిధి దిద్దుబాటు):-

వాస్తవ విస్తీర్ణం కన్న పాస్ పుస్తకంలో తప్పుగా నమోదు అయిన పక్షంలో సరి చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు.

మిస్సింగ్ సర్వే నంబర్ / సబ్ – డివిజన్ నంబర్:-

ఏదైనా సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ పాస్ పుస్తకంలో నమోదు కనిపించని సందర్భంలో, విస్తీర్ణం తక్కువగా నమోదైతే మార్చుకోవచ్చు అని తెలిపారు. ఇందుకు సంబంధించిన సర్వే నంబర్ వివరాలు ఎంచుకోవాలని అన్నారు.

నోషనల్ ఖాతా నుండి పట్టాకు బదిలీ:-

ఏదైనా కారణంతో భూమి 1బి ఖాతాలో చేరి ఆ తర్వాత పరిష్కారం అయిన వాటిని పట్టా భూమి గా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.

భూమి రకం మార్పు:-

ఏదైనా కారణంతో భూమి రకంలో వ్యవసాయ భూమి వ్యవసాయేతర గా, వ్యవసాయేతర భూమి వ్యవసాయ భూమి గా నమోదు అయితే సరి చేసుకునే అవకాశం ధరణి లో కల్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధరణి లో పొరపాటు లను సరిచేసుకోవాలని, సమస్యల పరిష్కారం కొరకు మీ- సేవా ద్వారా దరఖాస్తు తో పాటు గుర్తింపు కార్డులు ఆధార్, ఓటర్ ఐడి., డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్ లలో ఏదైనా రెండు జత చేయాలని, వాటితో పాటు పట్టా దార్ యొక్క పాత పాస్ పుస్తకం, పట్టాదార్ ధరణి పాస్ బుక్, పట్టాదారు 1బి., పాత పాస్ బుక్, పహానీ కాపీలు (సేత్వార్ / కస్రా), నూతన పాస్ బుక్, నూతన పహాని కాపీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లు జత చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది

Share This Post