ధరణి కి సంవత్సరం పూర్తి! జగిత్యాల జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు – జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకట తేదిః 29-10-2021
ధరణి కి సంవత్సరం పూర్తి!
జగిత్యాల జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు – జిల్లా కలెక్టర్ జి. రవి

 భూరికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికి ఆదర్శం
 జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం
 ధరణి వార్షికోత్సవ సందర్బంగా వేడుకలో పాల్గోన్న జిల్లా కలెక్టర్
 రాష్ట్రంలో అతి తక్కువ పెండేన్సీ ఉన్న జిల్లా జగిత్యాల జిల్లా
 అధికారులకు అభినందనలు తెలిపిన కలెక్టర్
జగిత్యాల, అక్టోబర్ 29: జిల్లాలో విజయవంతంగా ధరణి అమలవుతుందని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరణిని సమర్థవంతంగా అమలు చేస్తున్న సందర్బంగా అధికారులను అభినందిస్తూ, అర్డిఓలు, తహసీల్దార్ లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన. ధరణి కార్యక్రమం జగిత్యాల జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంది, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ ఈ ధరణి, భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది.
జగిత్యాల జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోంది. ధరణిని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న జగిత్యాల జిల్లాలోని సహచర అధికారులు, తహసీల్దార్లు, అధికారులను ,ధరణి టెక్నీకల్ సిబ్బంది ని అభినందిస్తు, ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో తమ పూర్తి సహాయ, సహకారాలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను
ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. అప్పుడు. ఇప్పుడు జిల్లాలో ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయి. ధరణి ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్ కొరకు గంటల సమయం పట్టేది. గతంలో తక్కువగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవి.

ధరణి లో ప్రత్యేకతలు

టాంపర్ ప్రూఫ్. పౌరులకు అనువుగా ఉండడం. *తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం. పారదర్శకత. ఆధునిక సాంకేతికత వినియోగం.వివక్షకు తావులేకుండా ఉండడం.*

అతితక్కువగా అధికారుల జోక్యం, ధరణి నిర్వహణా ప్రత్యేకతలు

అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం. బయో మెట్రిక్ నిర్ధారణ. ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ. రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం. ఆన్లైన్ చెల్లింపులు. అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ. పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా. నిషేదిత

భూములకు ఆటో-లాక్ విధానం.

నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 రకాల లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.

రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు
హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : ,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618

జగిత్యాల జిల్లాలో జరిగిన ధరణి లావాదేవీలు
విక్రయాలు : 17,599
గిఫ్ట్ డీడ్ : 3944
వారసత్వం : 2695
తనఖా : 4048

జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 3682
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 3423
నిషేధించబడిన జాబితా : 783
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 364

నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు.
ఈ ధరణి పోర్టల్ పై రైతులకు మరింత అవగాహన కల్పించాలని తెలియచేసారు
ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల, కొరుట్ల ఆర్డిఓలు శ్రీమతి ఆర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్, జిల్లా రెవెన్యూ అసోషియెషన్ అధ్యక్షులు వకీల్, టిఎన్జిఓ అధ్యక్షులు బోగ శశిధర్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రవీందర్, 18 మండలాల తహాసీల్దార్లు పాల్గోన్నారు.

ధరణి కి సంవత్సరం పూర్తి!
జగిత్యాల జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు – జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post