ధరణి కి సంవత్సరం పూర్తి* *సంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు* …. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

*ధరణి కి సంవత్సరం పూర్తి*
*సంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు* …. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించి, నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం కార్యకలాపాలను పూర్తి చేసుకుందని, దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు.

ధరణి పోర్టల్ ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంది. వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ అని, భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందన్నారు .
జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోందని, ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న జిల్లాలోని సహచర అధికారులు, తహసీల్దార్లు, మండల అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.

ధరణి విషయంలో తమ పూర్తి సహాయ, సహకారాలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని అందింస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయని, గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని, జిల్లాలో ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనారు.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయన్నారు. ధరణి ప్రారంభానికి ముందు గంటలు, గంటల సమయం పట్టేదని అన్నారు .

*ధరణి ప్రత్యేకంగా
* టాంపర్ ప్రూఫ్. *పౌరులకు అనువుగా ఉండడం. *తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం. *పారదర్శకత. *ఆధునిక సాంకేతికత వినియోగం. *వివక్షకు తావులేకుండా ఉండడం. *అతితక్కువగా అధికారుల జోక్యం ఉంటుందన్నారు.

అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం,బయో మెట్రిక్ నిర్ధారణ, ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ, రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్రి,రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తం ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం,ఆన్లైన్ చెల్లింపులు, అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ, పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా, నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం ధరణి నిర్వహణ ప్రత్యేకతలని తెలిపారు.

ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయని తెలిపారు.
*రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు*
హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
*పూర్తయిన లావాదేవీలు* : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
*పరిష్కరించబడిన ఫిర్యాదులు* : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618

సంగారెడ్డి జిల్లాలో జరిగిన ధరణి లావాదేవీలు* *1,06,333*

భూమి రిజిస్ట్రేషన్ లు : *52,593*
*జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు :*
వారసత్వం : *5722*
పెండింగ్ మ్యుటేషన్లు. :*15,491*
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : *9,939*
నాలా. :. *2302*
పార్టిషన్. :. *154*
సక్సే షన్ వితౌట్ పి పి బి : *973*
కోర్ట్ కేస్ .పిపిబి. :. *108*
నాలా వితౌట్ పి పి బి : *52*
జి పి ఎ. : *732*
ల్యాండ్ aquired. :. *998* నిషేధించబడిన జాబితా : 14,350
కోర్ట్ కేసులు మరియు సమాచారం :. *2919*

నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డి ఆర్ ఓ రాధిక రమణి, ఏవో స్వర్ణలత, రెవిన్యూ అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post