ధరణి కి సంవత్సరం పూర్తి హనుమకొండ జిల్లాలో విజయవంతంగా ధరణి అమలు :: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణీ వెబ్ సైట్ ద్వారా జిల్లాలో విజయవంతంగా ప్రజలకు సేవలందుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడొక ప్రకటన లో తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రికె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న ప్రారంభించారని, ధరణి పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుందని తెలిపారు. గత కొన్ని దశాబ్దాల కాలంగా భూ రికార్డులు అపడేట్ చేయలేదని, 2017లో భూ రికార్డుల శుద్దికరణ ఎల్ ఆర్ యూ పి ప్రారంభించి, రికార్డులను డిజిటలైజ్ చేసామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు వేగంగా సులభతరంగా సేవలు అందించే దిశగా ప్రభుత్వం ధరణీ రుపొందించిందని తెలిపారు. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉందని, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపారు. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన.ధరణి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసామని తెలిపారు.

హనుమకొండ జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోందని. ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న హనుమకొండ జిల్లాలోని సహచర అధికారులు, తహసీల్దార్లు, మండల అధికారులను అయన అభినందించారు.

ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయని, గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని,అప్పుడు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి కావని, ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు.
భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయని అన్నారు. ధరణి ప్రారంభానికి ముందు గంటలు, గంటల సమయం పట్టేదని, ప్రస్తుతం సత్వరమే సేవలు అందుతున్నాయని అన్నారు.
నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని,. ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు అట్టి ప్రకటనలో అయన వెల్లడించారు.

ధరణి లో ప్రత్యేకతలు
టాంపర్ ప్రూఫ్.
పౌరులకు అనువుగా ఉండడం.
తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం.
పారదర్శకత.
ఆధునిక సాంకేతికత వినియోగం. వివక్షకు తావులేకుండా ఉండడం.
అతితక్కువగా అధికారుల జోక్యం
ధరణి నిర్వహణా ప్రత్యేకతలు
అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం.
బయో మెట్రిక్ నిర్ధారణ.
ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ.
రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్.
రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం.
ఆన్లైన్ చెల్లింపులు.
అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ.
*పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా.
నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం.
నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత.
ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.

హనుమకొండ జిల్లాలో జరిగిన ధరణి లావాదేవీలు : 2,14,389
విక్రయాలు,గిఫ్ట్, మార్టిగేజి :15,147
ముటేషన్స్ : ౩,847
వారసత్వం :1,237
నాలా :1,155
పార్టిషన్ :58

జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 4,904
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 4,511
నిషేధించబడిన జాబితా : 2,300
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 460
అదార్ సీడింగ్ :44
NRIPPB : 27
సేమిఅర్బాన్ లాండ్స్ : 02

Share This Post