ధరణి, కోర్టు కేసులు, మీసేవ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 17: ధరణి, కోర్టు కేసులు, మీ సేవ దరఖాస్తులను అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మండల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల స్థాయిలో దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండు పడక గదుల ఇండ్లకు అర్హులైన వారి జాబితాను తయారు చేయాలని, ఈ నెల 25 లోగా అట్టి జాబితాను తమకు సమర్పించాలని ఆదేశించారు. గ్రామాల వారీగా మండల తహశీల్దార్లు మండల ప్రత్యేకాధికారితో సమన్వయం చేసుకుని గ్రామ సభలు నిర్వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రవికాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post