ధరణి టౌన్షిప్లు ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు

గురువారం ధరణి టౌన్షిప్లు మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మార్చి 7న ప్రీ బిడ్ సమావేశం గెలాక్సీ ఫంక్షనల్ లో ఉంటుందని చెప్పారు. ఆసక్తిగలవారు సమావేశానికి రావాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గజానికి 10 వేల రూపాయల ధర ఉంటుందని తెలిపారు. దళారుల బెడద ఉండదని, పూర్తిగా పారదర్శకంగా బహిరంగ వేలం జరుగుతోందని పేర్కొన్నారు. మండల స్థాయిలో ధరణి టౌన్షిప్ పై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతిక సారధి కళాకారులు పాటలు పాడారు. కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వెంకట మాధవరావు, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, అధికారులు పాల్గొన్నారు. —————- జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది

Share This Post