ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్

ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో గురువారం ధరణి టౌన్ షిప్ ఫ్లాట్ల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 230 ప్లాట్లకు వేలం వేయగా 217 ప్లాట్లు విక్రయించినట్లు చెప్పారు. మొదటిరోజు 62, రెండవ రోజు 70, మూడవరోజు 40, నాలుగో రోజు 45 ప్లాట్లు విక్రయించినట్లు పేర్కొన్నారు. 13 ప్లాట్లు కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు ముందుకు రాలేదని చెప్పారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌, ఆర్ డి ఓ శీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది

Share This Post