ధరణి టౌన్షిప్ లో రేపు 70 ప్లాట్లకు వేలం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి: మార్చి 14 (2022): ధరణి టౌన్షిప్ లోని 70 ప్లాట్లకు మంగళవారం వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్ లో సోమవారం ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్ల వేలం పాట పై విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సోమవారం 62 ప్లాట్ల కు వేలం వేసినట్లు చెప్పారు. చదరపు గజానికి ఏడు వేల రూపాయల నుంచి 14,200 వరకు ధర పలికిందని పేర్కొన్నారు. బహిరంగ వేలానికి విశేష స్పందన లభించిందని తెలిపారు.195 వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నట్లు చెప్పారు. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్ ఉండడంతో సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, హైదరాబాద్ ఈ ప్రాంతాలకు చెందిన వారు వేలంపాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజీవ్ స్వగృహ పథకంలో గతంలో రూ. 3000 చెల్లించిన లబ్ధిదారులు వేలంపాటలో పాల్గొనవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చి 14 నుంచి 17 వరకు వేలం పాట దశల వారీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలోజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శీను, అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది

Share This Post