ధరణి తో భూ సమస్యల పరిష్కారం:: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

ధరణి తో భూ సమస్యల పరిష్కారం:: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

జనగామ, సెప్టెంబర్ 4: ధరణి తో భూ సమస్యల పరిష్కారం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం బిఆర్ కెఆర్ భవన్, హైద్రాబాద్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ కార్యక్రమం నిర్వహించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. భూ రికార్డులను సమగ్రంగా ఏకీకృతంగా నిర్వహించుటకు ట్రాన్స్ యాక్షన్ లను ఎప్పటికప్పుడు ఆధునీకరించడానికి ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ధరణి పోర్టల్ ఒకటి అని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించడానికి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఈ వ్యవస్థను అమలు చేయడం లేదని అన్నారు. ధరణి ప్రారంభించిన ఒక సంవత్సరం కాలంలోనే 8 లక్షలకు పైగా లావాదేవీలు జరిగాయని, ధరణి పోర్టల్ ఇప్పటివరకు 4 కోట్లకు పైగా హిట్లను పొందిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, పారదర్శకంగా పనిచేసే విధంగా ధరణి మాడ్యూల్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ధరణి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ఆధారంగా మాత్రమే పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ వ్యవస్థను సక్రమంగా అమలు చేసేలా చూడాలని, పెండింగ్ లో ఉన్న ధరణి గ్రీవేన్స్ ను క్లియర్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ధరణి గ్రీవేన్స్ ను పరిష్కరించడంపై ఉదాహరణలతో జిల్లా కలెక్టర్లకు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి ద్వారా భూ సంబంధిత సమస్యలు విజయవంతంగా పరిష్కరిస్తామన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీచేయనైనది.

Share This Post