ధరణి దరఖాస్తులు పరిష్కారం లో జిల్లా ముందజా. రెవెన్యూ సిబ్బందికి అభినందనలు. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో ధరణి దరఖాస్తులు పరిష్కారం లో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా  ముందజలో ఉందని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.  శుక్రవారం ధరణి కార్యక్రమం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా  సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి యొక్క ఉద్దేశ్యం, సాధించిన విజయాలు, విశిష్టతలు వివరించారు.  ధరణి ప్రారంభంలో రెవెన్యూ భూ సమస్యలకు పరిష్కారం చూపడం అలాగే భూముల క్రయ విక్రయాలు సులభతరం , పట్టా మార్పిడి అప్పడికప్పుడే మర్చడంజరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగడం పూర్తిగా తగ్గిందని అన్నారు. ధరణి లో అధికారి ఇష్టాయిష్టాలు కు సంబంధం లేకుండా  క్యాంపూ టర్ సాఫ్ట్వేర్ ద్వారానే ఎలాంటి ఆటంకాలు , అవకతవకలు లేకుండా భూసంబండమైన మార్పులు, చేర్పులు సులభంగా, నేరుగా జరుగుతున్నాయని వివరించారు. ఆఫ్ లైన్ రికార్డులను పూర్తిగా ఆన్లైన్ చేయడం పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ధరణి భూ సమస్యల పరిష్కారంలో హైద్రాబాద్ మినహా 32 జిల్లాలో సూర్యాపేట అగ్రగామిగా నిలిచిందని స్పష్టం చేశారు.  అలాగే జిల్లాలో వివిధ భూసంబందిత విభాగాల కింద జిల్లాలో 28409 దరఖాస్తులను గురువారం రాత్రి 11 గంటల వరకు పూర్తిగా పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఇప్పటి నుండి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈరోజు దరఖాస్తులు అదే రోజు పరిష్కరిస్తుంది దని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  జిల్లాలో మొత్తం దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ శాఖలోని వివిధ స్థాయి అదికారులు, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అదనపు కలెక్టర్,ఆర్.డి. ఓ లు, తహశీల్దార్లు కృషి ఎంతో ఉందని ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా పని చేసినందుకు  ఈ సందర్భంగా అందరినీ అభినందించారు.  ఈ సమావేశంలో ఏ. ఓ శ్రీదేవి,  పర్యవేక్షకులు పులి సైదులు టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post