ధరణి ద్వారా భూములకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు రేపటిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తాసిల్దార్ లను ఆదేశించారు

ప్రెస్ రిలీజ్. తేది 04.08.2021 ధరణి ద్వారా భూములకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు రేపటిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తాసిల్దార్ లను ఆదేశించారు. బుధవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. భూములకు సంబంధించి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా చూడాలని కోరారు. వచ్చిన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో రవీందర్, ఆర్ డి వో లు శీను, రాజా గౌడ్, సూపరిండెంట్ లు రంజిత్ కుమార్, నారాయణ, సువర్ణ, సరళ, ఉమలత, స్వప్న పాల్గొన్నారు. Dpro..Kamareddy.

Share This Post