ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు సులబతరంగా నిష్పక్షపాతంగా సేవలు అందించటం జరుగుతుందని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ జోగులాంబ గద్వాల జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు సులబతరంగా నిష్పక్షపాతంగా సేవలు అందించటం

జరుగుతుందని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ జోగులాంబ గద్వాల జిల్లాలో  విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ హాలు నందు  ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ధరణి పోర్టల్ ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం పూర్తి అవడం అభినందనీయం అని అన్నారు. గౌరవ ముఖ్య మంత్రి గారు మంచి విజన్ తో, పారదర్శక మైన రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను  తయారు చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ధరణి సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం  సులభతరంగా మారిందని, ప్రతి మండలం లోవ్యవసాయ భూములకు సంబంధించి  వన్ స్టాప్ సొల్యూషన్ చేయగలుగుతున్నమన్నారు. మండల స్థాయి లో అడ్వాన్సు స్లాట్ లు త్వరగా ఏర్పాటు అయితే ప్రజలు స్లాట్ బుకింగ్ సులబంగా చేసుకోవచ్చని అన్నారు. జిల్లాలో గడచిన ఏడాది కాలంలో మొత్తం 31,000 ధరకాస్తులు రాగా అందులో 30,000  వేల ధరకాస్తులు డిస్పోస్ చేసామని, 10,656 సేల్స్ ట్రాన్ జెక్షన్ లు, 4,638 గిఫ్ట్ డీడ్ లు, 1,987 సక్షేశన్ ,మార్టి గేజ్ 880 లు జరిగాయని వివరించారు. అలాగే 5805 పెండింగ్ మ్యుటేషన్ లు క్లియర్ చేశామని, 4919 గ్రీవెన్స్, 407 ప్రోహిబిషన్ లిస్ట్ సమస్యలు, 211 కోర్ట్ కేసులు పరిష్కరించామనీ తెలిపారు. ధరణి లో 31 రకాల మాడ్యుల్ లు అందుబాటులో ఉన్నాయని  ప్రజలు వీటిని వినియోగించు కొని భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించు కోవాలని సూచించారు.

జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు

పెండింగ్ మ్యుటేషన్లు. : 5,805

భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 4919

నిషేధించబడిన జాబితా : 407

కోర్ట్ కేసులు మరియు సమాచారం : 211

 

నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను   గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు.

ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

.          ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, తదితరులు పాల్గొన్నారు.

తదనంతరం తహసిల్దార్లతో  ఏర్పాటు చేసిన సమావేశంలో ధరణి పోర్టల్ వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి  శుభాబినందనలు తెలియజేశారు

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post