ధరణి ప్రారంభమై నేటితో సంవత్సరం పూర్తి ★ భూ రికార్డ్ ల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే ఆదర్శం ★ జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం ధరణి ప్రారంభమై సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాలలోని కలెక్టర్ చాంబర్ లో పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 29:
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా భూ రికార్డ్ ల నిర్వహణకై ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోంది. .
ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంది, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది.
ధరణి సూపర్ సక్సెస్
ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి చేరాయి. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. అప్పుడు జిల్లాలో ఒకటి, రెండు రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి కావు. ఇప్పుడు జిల్లాలో ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 తహశీల్దార్ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి. ప్రజలకు అందుబాటులో అతి సమీపంలో రిజిస్ట్రేషన్ లు జరగడం వల్ల ప్రజలకు దూర భారం తగ్గి సమయం కలిసి వస్తుంది. భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయి.
గతంలో భూ యజమానులు కు తెలియకుండా మధ్యవర్తులు, దళారులు, పైరవీ కారులు అధికారుతో రికార్డ్ లు, పేర్ల మార్పిడి ఘటనలు అక్కడ అక్కడ జరిగేవి.
ధరణి అలాంటి ఘటనలకు చెక్ పెట్టింది. ధరణి ప్రారంభానికి ముందు దీనికి గంటల సమయం పట్టేది. గతంలో తక్కువ గా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవి. ధరణి రాకతో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ధరణి లో ప్రత్యేకతలు
టాంపర్ ప్రూఫ్, పౌరులకు అనువుగా ఉండడం, తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం,
పారదర్శకత, ఆధునిక సాంకేతికత వినియోగం, వివక్షకు తావులేకుండా ఉండడంతో పాటు అతితక్కువగా అధికారుల జోక్యం.

ధరణి నిర్వహణ ప్రత్యేకతలు
అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం, రైతు స్వేచ్చగా ఏ రోజూ, ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తానే నిర్ణయించుకునే సౌలభ్యం, బయో మెట్రిక్ నిర్ధారణ, ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ, రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తం ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం, ఆన్లైన్ చెల్లింపులు, అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ, పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా, నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం తో పాటు నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.

రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు
హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618

భూ పరిపాలనలో ధరణి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయం:జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సాహోసోపేతమైన విప్లవాత్మకమైన నిర్ణయం ధరణి అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

ధరణి ప్రారంభమై సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ధరణి పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
అనతి కాలంలోనే భూ రికార్డుల ప్రక్షాళన సక్సెస్ పుల్ కావడానికి దోహదపడిందని, రిజిస్ట్రేషన్లు సులభతరం చేసిందని తెలిపారు. ధరణిలో నిక్షేపమైన భూములకు భద్రత, భరోసా ఉన్నాయని, 30, 40 ఏళ్ల నుంచి ఎన్నో విధాలుగా భూమి పంచాయతీలు, భూమి సమస్యలు, అభద్రత, ఇతరత్రలకు తెర పడిందని కలెక్టర్ తెలిపారు. రానున్న కాలంలో భూ వివాదాలకు తావు లేకుండా, అవినీతికి తావులేకుండా, అధికారులు ఇష్టం వచ్చినట్లు చేయకుండా పకడ్బందీ వ్యూహంతో ధరణి రూపకల్పన చేసినట్లు కలెక్టర్ వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మ్యుటేషన్, పాస్ బుక్ వచ్చేందుకు నెలలు, సంవత్సరాల సమయం పట్టేదనీ , ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ జరగడంతో పాటు పాసు బుక్ కొనుగోలుదారుకు వస్తుందన్నారు.
ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో ధరణి పురోగతి వివరాలు

జిల్లాలో ధరణిలో పూర్తి లావాదేవీలు : 29 వేల 331
భూమి రిజిస్ట్రేషన్లు : 20 వేల 240
వారసత్వం : 470
పెండింగ్ మ్యుటేషన్లు. : 3 వేల 611
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 3 వేల 599
నిషేధించబడిన జాబితా : 625
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 115
నిషేదిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేసందుకు గాను గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ అన్నారు. అన్ని సబ్ సెంటర్లలో వ్యాక్సినేషన్ క్యాంపులు నిరంతరం కొనసాగుతాయని, ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకొని వారు వెంటనే మొదటి డోసు తీసుకోవాలని, మొదటి డోసు తీసుకొని, నిర్ణీత సమయం దాటిన వారు రెండో డోసు తీసుకోవాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ సురక్షితమని ఆయన అన్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలన్నారు. కరోనా పట్ల అవగాహన కలిగి, జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ రెవిన్యూ అధికారి టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, రాజన్న సిరిసిల్లచే జారిచేయనైనది.

Share This Post