బతుకమ్మ చీరల పంపిణీ జిల్లాలో ఇప్పటి వరకు 40 శాంతం మాత్రమే జరిగిందని, మిగతా చీరల పంపిణీ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్ లను ఆదేశించారు.
ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అన్ని మండలాల తహసీల్దార్ లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిరోజు చీరల పంపిణీ వివరాలను తన వాట్సాప్ కు పంపించాలని సూచించారు.
జిల్లాలోని 17 మండలాల్లో మినీ పల్లె ప్రకృతి వనాలకు స్థలాల సేకరణ జరుగలేదని, ఇట్టి పనులను ఎంపీడీఓ లతో కలసి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ధరణి కార్యక్రమంలో భాగంగా పెండింగ్ లో ఉన్న పోబే కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములను గురించి సమస్యలు పరిష్కరించాలన్నారు. దరఖాస్తు రిజెక్ట్ చేసే ముంది పూర్తి జాగ్రత్త వహించాలని, రిజెక్ట్ కు సంబంధించిన కారణాలను స్పష్టంగా తెలియపర్చాలని ఆదేశించారు. ఇట్టి పనులను వారం రోజులలో పూర్తి చేయాలని, దేనికోసం తహసీల్దార్లు కష్టపడి పని చేయాలన్నారు. పనులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ నిఖిల హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, వికారాబాద్, తాండూర్ RDO లు ఉపేందర్ రెడ్డి, అశోక్ కుమార్ లు, కలెక్టర్ కార్యాలయ AO హరిత, ధరణి తహసీల్దార్ సుధా, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.