మంగళవారం ఉదయం వరంగల్ కలెక్టరేట్ లో జూలై 16 వ తేదీన ఏర్పాటుచేసిన ధరణి భూ సమస్యల విచారణ కేంద్రం ద్వారా రైతులకు ఆన్లైన్లో వారి సమస్యలపై దరఖాస్తు చేసుకొనుటకు కావాల్సిన పత్రాల వివరాలను మరియు మిసేవ కేంద్రంలో పెట్టిన దరఖాస్తుల యొక్క వివరాలు ఈ ధరణి హెల్ప్‌డెస్క్ నందు రైతులకు తెలుపుతున్నారు.
ధరణి కోఆర్డినేటర్ సాయికిరణ్ ఇప్పటివరకు సుమారుగా 6270 రైతులకు ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి వాటికి కావలసిన ప్రతుల వివరాలను మరియు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ సమస్య యొక్క పురోగతి వివరాలను రైతులకు తెలిపినట్లు కలెక్టర్‌కు వివరించారు.
ధరణి కేంద్రానికి వచ్చిన వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ రైతు ఎన్ చిన్నయ్యను ధరణి సేవ ల పైన కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ధరణి helpdesk నందు పెట్టిన రిజిస్టర్‌ను కలెక్టర్ పరిశీలించారు.
రిజిస్టర్ నందు రైతు యొక్క పేరును నమోదు చేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్, రిజిస్టర్ లో రైతు పేరు, గ్రామం పేరు, మండలం వివరాలు మరియు రైతు పెట్టిన సమస్య యొక్క వివరాలు కూడా వ్రాయాలని కలెక్టర్ సూచించారు.
భూ సమస్యల విచారణ కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ధరణి కో ఆర్డినేటర్ మరియు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.