*ధరణి, మీసేవ దరఖాస్తులు, కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ధరణి, మీసేవ దరఖాస్తులు, కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-4*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26: జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ధరణి, మీసేవ దరఖాస్తులు, కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ అంశాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమీక్షలో వేములవాడ ఆర్డీఓ వి. లీల, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, పర్యవేక్షకులు రవికాంత్, రమేష్, సుజాత, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post