ధరణి లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ధరణి లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

ధరణి లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూలై -22:

ధరణి లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

శుక్రవారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక డి.ఎఫ్. ఓ. రవికిరణ్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి ఫారెస్ట్, రెవెన్యూ బౌండరీ, ఆర్. ఓ.ఎఫ్.ఆర్., ధరణి సంబంధిత అంశాలపై ఫారెస్ట్, రెవెన్యూ,సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫారెస్ట్, రెవెన్యూ హద్దులను గుర్తించాలని, సర్వే నంబర్ వారీగా ఉన్న భూమి ఎంత, ఫారెస్ట్, రెవెన్యూ కు సంబంధించినది ఎంత మేరకు ఉన్నది గుర్తించాలని, టైటిల్ డీడ్, ఎంట్రీ మిస్సింగ్ లను సరి చేయాలని, ఆర్. ఓ.ఎఫ్.ఆర్. డాటాను రైతు బందు డాటా తో పోల్చుకుని వ్యత్యాసాన్ని క్లియర్ చేయాలని, సర్వే, మండలం వారీగా వివరాలు నమోదు చేయాలని, సబ్ డివిజన్ వారీగా వర్కౌట్ చేసి ధరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కొమురయ్య, రమేష్, ఏ.డి.ఎస్.ఎల్.ఆర్., తహసిల్డార్ లు, డి.టి.డి. ఓ., డి. ఏ. ఓ., అటవీ అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post