ధరణి వార్షికోత్సవం వేడుకలు నిర్వహించిన జిల్లా కలెక్టర్


విజయవంతంగా అమలవుతున్న ధరణీ:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
అక్టోబర్ 29,2020న సీఎం చేతుల మీదుగా ప్రారంభించిన ధరణీ
పారదర్శకంగా మరియు పటిష్టంగా అందతున్న సేవలు
సులభతరంగా మరియు వేగంగా పూర్తవుతున్న రిజీస్ట్రేషన్లు
సంవత్సర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ధరణీ ద్వారా 10 లక్షలకు పైగా లావాదేవిలు పూర్తి
• * సంవత్సర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ధరణీ ద్వారా 5 లక్షలకు పైగా ఫిర్యాదు పరిష్కారం*
జిల్లాలో ధరణీ ద్వారా 16607 లావాదేవిలు పూర్తి మరియు 13869 సమస్యల పరిష్కారం
ఒకేసారి రిజీస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ సేవలు
ధరణీ విజయవంతం చేస్తున్న రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
ధరణీ ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించిన వేడుకలో పాల్గోన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి,అక్టొబర్ 29 :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణీ వెబ్ సైట్ ద్వారా జిల్లాలో విజయవంతంగా ప్రజలకు సేవలందుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ధరణీ ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలో జిల్లా కలెక్టర్ పాల్గోన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న ప్రారంభించారని, నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుందని తెలిపారు. గత కొన్ని దశాబ్దాల కాలంగా భూ రికార్డులు అపడేట్ చేయలేదని, 2017లో భూ రికార్డుల శుద్దికరణ ఎల్ ఆర్ యూ పి ప్రారంభించి, రికార్డులను డిజిటలైజ్ చేసామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు వేగంగా సులభతరంగా సేవలు అందించే దిశగా ప్రభుత్వం ధరణీ రుపొందించిందని తెలిపారు. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంది, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన.ధరణి కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసామని తెలిపారు. ధరణి ని సమర్థవంతంగా అమలు చేయడంలో పాలుపంచుకుంటున్న సహచర అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మరియు సిబ్బందికి , తహసీల్దార్లు, మండల అధికారులను, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్ అభినందించారు ఇట్టీ తమ పూర్తి సహాయ, సహకారాలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని అందింస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ధరణి ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయని, గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయని తెలిపారు ధరణి ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్ గంటలు, గంటల సమయం పట్టేది. ధరణీ వెబ్ సైట్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, ధరణీ టాంపర్ ప్రూఫ్ , పౌరుల వినియోగానికి సులభంగా ఉంటుందని, తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం ఉందని, పారదర్శకత, అతితక్కువగా అధికారుల జోక్యంతో రుపొందించబడిందని తెలిపారు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ సౌకర్యం ఉందని, స్లాట్ బుక్ చేసుకుంటే 15 నిమిషాలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొవచ్చని కలెక్టర్ తెలిపారు. ధరణీ బయోమెట్రిక్ విధానంతో పనిచేస్తుందని, ఎవరు రికార్డులు మార్చే అవకాశం ఉండదని తెలిపారు. రిజస్ట్రేషన్ సమయంలో ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తామ్ ఆటోమేటిక్ గా తెలుస్తుందని తెలిపారు. నిషేదిత భూముల లావాదేవిలు జర్గకుండా వాటిని లాక్ చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా స్పేషల్ డ్రైవ్ నిర్వహించి నిషేదిత జాబితా నుండి తొలగించాల్సిన భూములను నెల రోజులో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం కాలంగా 10,45,878 స్లాట్‌లు బుక్ అయ్యాయని, 10,00,973 లావాదేవిలు పూర్తయ్యాయని, 5.17 లక్షల ఫిర్యాదులు పరిష్కారం జరిగాయని కలెక్టర్ తెలిపారు.

కార్యక్రమంలో పాల్గోన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  రిజిస్ట్రేషన్ లో విప్లవాత్మకంగా ధరణీ వెబ్ సైట్ రుపొందించిన సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు సులభతరంగా వేగంగా సేవలు అందతున్నాయని అన్నారు. రైతుల రికార్డులను ఎవరు బదలాయించకుండా పకడ్భందిగా ధరణీ రుపొందించారని తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, కలెక్టరేట్ ఏఓ.కై.వై. ప్రసాద్, కలెక్టరెట్ సూపరిండెంట్లు తూము రవీందర్, దత్తు ప్రసాద్,నారాయణ, అనుపమా రావు, కలెక్టరెట్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Share This Post