ధరణి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ధరణి పోర్టల్ ద్వారా స్వీకరించిన క్లెయిమ్స్ అన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తహసీల్దార్లను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి వెల్దండ, ఉరుకొండ తహసిల్దార్ కార్యాలయలను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు.
ధరణి అంశాలవారీగా ఉన్న పెండింగ్ లను అడిగి తెలుసుకున్నారు.
తహసీల్దార్లు పూర్తిగా ధరణి పై దృష్టి పెట్టాలని, ధరణి కింద ఉన్న ప్రతి క్లెయిమ్ ను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిందిగా ఆదేశించారు.
అన్ని పనులకంటే ముందు ధరణి పెండింగ్ దరఖాస్తులన్నీటిని పరిష్కరించాలని చెప్పారు.
ధరణి అంశాన్ని రాష్ట్రస్థాయిలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పెండింగ్ సమస్యలు, దరఖాస్తులను పరిశీలిస్తున్నారని తెలిపారు.
అందువల్ల వీటి పరిస్కారం పై తహసీల్దారులు ప్రత్యేక దృష్టి నిలపాలని అన్నారు.
ధరణి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనందున తహసీల్దార్లు ప్రతిరోజు 9 గంటలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.
పెండింగ్ మ్యుటేషన్లు, సక్సిషన్లు, దరఖాస్తులు అన్నింటికీ ఒక సమయాన్ని నిర్దేశించుకొని నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తిచేయాలని చెప్పారు. ప్రతి సక్సేషన్ ను పంచనామా నిర్వహించి పరిష్కరించాలని తెలిపారు.
మండలాల్లో ధరణి కింద ఉన్న కేసులు వాటన్నింటిని క్లియర్ చేయాలని చెప్పారు. అదేవిధంగా సక్సేషన్ కేసులు ఉన్నాయని వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రొహిబీటెడ్ భూములకు సంబంధించిన అప్లికేషన్ లపై రికార్డులను పరిశీలించి అప్డేట్ చేయాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్డిఓ రాజేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share This Post