ధరణీలో వచ్చిన సమస్యలు విలైనంత తొందరగా పరిష్కారించాలని జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు

పత్రిక ప్రకటన:-
2 మే 2022

ధరణీలో వచ్చిన సమస్యలు విలైనంత తొందరగా పరిష్కారించాలని జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సొమవారం ఐడిఓసీ మిటీంగ్ హల్ లో వివిధ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లాలో అన్ని మండలాల వారిగా ధరణీ పై సమీక్ష జరపారు. సిలింగ్, ఇనాం, అసైన్డ్ మరియు వివిధ పట్టాలలో పెండింగ్ లో ఉన్నవి ఏన్ని వాటి పరిష్కారం ఎలా అనే విషయాలపై అధికారులతో ఆరా తీశారు. వారి నుండి వచ్చిన సందేహాలకు తగిన సూచనలు చెయ్యడం జరిగింది.
ప్రజావాణి లో ఏక్కువ మొత్తం లో అర్జిలు ధరణీ కీ సంబంధించినవి కనుక వాటిని మళ్లీ అర్జి పెట్టుకోకుండా తొందరగా పరిష్కారించాలన్నారు.

ప్రజలకు సౌకర్యర్దం ధరణీలో మార్చుకునే పక్రియ వచ్చిందని తెలిపారు. అవి 1.పేరు మార్పు 2.భూమి స్వభావం యొక్క మార్పు 3. భూమి వర్గీకరణ మార్పు 4.భూమి రకం మార్పు 5. పరిధి దిద్దుబాటు
6.మిస్సింగ్ సర్వే/ సబ్ డివిజన్ నెంబర్ 7.నేషనల్ ఖాతా( అన్ని రకాల) నుండి పట్టా కు భూమిని బదిలీ 8. భూమి రకం మార్పు
మార్చుకొనికి అవకాశం కల్పించారు.

తప్పనిసరిగా గూగుల్ మ్యాపింగ్ చెయ్యాలి. గవర్నమెంట్ లాండ్స్ కీ పీఓబి పెట్టాలి. మీ-సెవ లో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు తొందరగా పరిష్కారించాలి. మండలాల్లో ఉన్న పాత రికార్డులను తీసి సెప్టి
గదిలో అన్నింటినీ భద్రపరచాలి.

జిల్లాలో ఇరిగేషన్ కి సంబంధించి చెరువు కట్టలు , కాలులను పరిషిలించి వాటికి కావలసిన మరమ్మతులు చెయ్యాలి.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంపై సమీక్ష జరిపారు. పెండింగ్ లో ఉన్న అన్ని అప్లికేషన్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
రెవెన్యూ కు సంబంధించి అన్నిటికీ జిల్లా అధికారులు ఆర్డీవోలు మండల స్థాయిలో ఎమ్మార్వోలకు కు సూచనప్రాయంగా పరిష్కార మార్గాలను తెలియజేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో డిఆర్ఓ చెన్నయ్య, ఏవో రెహమాన్, ఆర్డివో లు జయచంద్రారెడ్డి, అనంతరెడ్డి లు మరియు జిల్లా రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Share This Post